జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతం

ABN , First Publish Date - 2023-01-24T23:42:26+05:30 IST

జాతీయస్థాయిలో ఎస్‌టీఏ నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో మూడు, కొత్తగూడెంలో ఒక పరీక్షా కేంద్రంలో ఈ పరీక్షలు నిర్వహించారు.

 జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతం
ఖమ్మంలోని ఓ కేంద్రం వద్ద విద్యార్థినిని తనిఖీ చేస్తున్న దృశ్యం

తొలిరోజు 1,075 మంది విద్యార్థుల హాజరు

ఖమ్మం ఖానాపురంహవేలి, జనవరి 24: జాతీయస్థాయిలో ఎస్‌టీఏ నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో మూడు, కొత్తగూడెంలో ఒక పరీక్షా కేంద్రంలో ఈ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు మొత్తం 1,088 మంది విద్యార్థులకు గాను 1,075మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో మెత్తం 904మంది విద్యార్ధులకు గాను 897మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పరీక్షల సిటీ కో-ఆర్డినేటర్‌ ఆర్‌. పార్వతిరెడ్డి తెలిపారు. ఖమ్మం కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 126మంది, సాయంత్రం 124విద్యార్థులు, విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉదయం 134, సాయంత్రం 134మంది విద్యార్థులు, ఎస్‌బీఐటీలో ఉదయం 188, సాయంత్రం 191మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారని కో ఆర్డినేటర్‌ తెలిపారు. విద్యార్థులను ఉద యం 8.30గంటల నుంచే పరీక్ష కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండల పరిధిలోని అకిట్స్‌ కళాశాలలో తొలిరోజు జేఈఈ మెయిన్స పరీక్షకు ఉదయం 92మంది విద్యార్థులకు గాను 88మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 92మంది గాను 90మంది హాజరయ్యారు.

Updated Date - 2023-01-24T23:42:26+05:30 IST