హాస్టల్‌ వర్కర్ల ధర్నా

ABN , First Publish Date - 2023-01-24T22:42:50+05:30 IST

గిరిజన హాస్టల్స్‌లో అవుట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌ కార్మికులకు తమకు తక్షణమే 39 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ముం దు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

హాస్టల్‌ వర్కర్ల ధర్నా
ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం

భద్రాచలం, జనవరి 24: గిరిజన హాస్టల్స్‌లో అవుట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌ కార్మికులకు తమకు తక్షణమే 39 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ముం దు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాల బడ్జెట్‌ రూ.9 కోట్ల చెక్కును ఆర్ధిక శాఖ నుంచి వెంటనే క్లియరెన్సు ఇచ్చి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కుబేర్‌లో విధించిన ఫ్రీజింగ్‌ను వెంటనే ఎత్తివేయాలని, బకాయి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంద ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు బ్రహ్మాచారి, రత్నం రాజేందర్‌, పాయం ముత్తయ్య, రాములు, జలంధర్‌, లక్ష్మణ్‌నాయక్‌, తిరుపత మ్మ, సమ్మక్క, భద్రమ్మ, జోడలక్ష్మి, రామారావు, రాము, నాగమణి పాల్గొన్నారు

Updated Date - 2023-01-24T22:42:50+05:30 IST