కరెంటు కోతలు.. అన్నదాతల వెతలు

ABN , First Publish Date - 2023-01-25T23:30:28+05:30 IST

: ‘వ్యవసాయానికి 24గంటలు ఉచితంగా విద్యుత సరఫరా చేస్తున్నాం. 29రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా సాగుకు ఉచిత విద్యుత అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపాం’ అని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా చెబుతున్న మాటలు. కానీ వారివన్నీ గొప్పలేనని ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. క్షేత్రస్థా

కరెంటు కోతలు.. అన్నదాతల వెతలు

మాటల్లోనే.. వ్యవసాయానికి 24గంటల విద్యుత

ప్రస్తుతం సరఫరా అవుతున్నది 12గంటలే..

వేళలు పాటించకపోవడంతో పొలాల వద్ద రైతుల పడిగాపులు

కొన్నిచోట్ల నీరందక ఎండుతున్న పంటలు

వైరా/ముదిగొండ, జనవరి 25 : ‘వ్యవసాయానికి 24గంటలు ఉచితంగా విద్యుత సరఫరా చేస్తున్నాం. 29రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా సాగుకు ఉచిత విద్యుత అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపాం’ అని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా చెబుతున్న మాటలు. కానీ వారివన్నీ గొప్పలేనని ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వారి మాటలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా కేవలం 12గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని విధంగా సరఫరా వేళలు ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా నిత్యం గంటలకొద్దీ అప్రకటిత కరెంట్‌కోతలు విధిస్తుండటంతో కరెంట్‌ కోసం రైతులు పొలాల వద్ద రేయిపగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు పగటిపూట మాత్రమే వ్యవసాయానికి కరెంట్‌ ఇవ్వగా.. కరెంట్‌లైన్లు ఇతర మరమ్మతుల పేరుతో ఎప్పుడుపడితే అప్పుడు గంటలకొద్దీ సరఫరాను నిలిపివేశారు. దాంతో తడిచిన పైరే మళ్లీ మళ్లీ తడవడం తప్ప ఉపయోగం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం యాసంగిలో ఎక్కువమంది రైతులు వరి, మొక్కజొన్న వేయగా.. కొన్నిచోట్ల మిర్చి, ఇతర పంటలు కూడా సాగులో ఉన్నాయి. రోజుకు ఐదారుగంటలకు మించి వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా చేయడకపోవడం, అదీ ఒక సమయమంటూ ఉండకపోతుంటంతో పంటలు ఎండిపోతున్నాయి. దాంతో పంటలను బతికించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

విద్యుత కోతలతో ఎండుతున్న పంటలు

కొన్ని ప్రాంతాల్లో అకాలవర్షాలు, చీడపీడలతో పత్తిపంట వేసిన రైతులకు నష్టమే మిగలడంతో.. యాసంగిలో మొక్కజొన్న సాగుచేశారు. ఈ క్రమంలో వేలకువేలు పెట్టుబడులు పెట్టగా.. విద్యుతకోతల కారణంగా సరైన సమయంలో సాగునీరందక ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చులతో తీవ్ర నష్టాల్లో ఉన్నామని, వ్యవసాయానికి అంతరాయం విద్యుత అందించాలని, కానీ వారాల తరబడి కోతలు విధిస్తే మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత కోతలు లేకుండా సరఫరా అందించాలని రైతులు కోరుతున్నారు. ఇక ముదిగొండ మండలం వెంకటాపురం రైతులు విద్యుత కోతలతో తమ పంటలు ఎండిపోతున్నాయని, సరిపడా విద్యుత అందించాలని ముదిగొండ మండలం వెంకటాపురం రైతులు మంగళవారం ట్రాన్సకో ఏఈ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

విద్యుత కోతలతో మొక్కజొన్న ఎండిపోతుంది

కందుల రంగారావు, వెంకటాపురం, ముదిగొండ మండలం

25ఎకరాల్లో మొక్కజొన్న వేశా. వారంరోజులుగా అనధికారికంగా కరెంట్‌ తీస్తున్నారు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదు. దీంతో పంటకు నీరందించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఇలానే వారం పాటు కోతలను కొనసాగిస్తే పంట పూర్తిగా ఎండిపోయి నష్టపోతాం. అధికారులు స్పందించి నిరంతరాయంగా విద్యుత సరఫరా చేయాలి.

ఖమ్మం జిల్లా చింతకానిలో సబ్‌స్టేషన్ల ముట్టడి

చింతకాని, జనవరి 25: వ్యవసాయానికి అందించే విద్యుత సరఫరాలో అప్రకటిత విద్యుత కోతలు విధిస్తుండటంపై రైతులు కన్నెర్ర చేశారు. అధికారుల తీరుతో విసుగు చెందిన చింతకాని మండలంలోని పలు గ్రామాల రైతులు.. బుధవారం మండల పరిధిలోని రాఘవాపురం, నాగులవంచ, పందిళ్లపల్లి సబ్‌స్టేషన్లను ముట్టడించారు. ప్రతీ సబ్‌స్టేషన ఎదుట 100మందిపైగా రైతులు ధర్నాలో పాల్గొన్నారు. ప్రస్తుతం మండలంలో చాలావరకు వ్యవసాయ బోర్లు, బావుల కింద మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న పంటలకు నీరు ఎక్కువగా అవసరమని, ప్రస్తుతం ఎండలు కూడాఅధికమవుతున్నాయని, ఈ క్రమంలోనే వారం రోజులుగా అధికారులు అప్రకటిత విద్యుత కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చివరి దశలో ఉన్నాయని, ఈ సమయంలో విద్యుత సక్రమంగా అందక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేకుండా విద్యుత పగటి పూట విద్యుత సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు రెండు గంటల పాటు రోడ్డుపై భైఠాయించడంతో బోనకల్‌-ఖమ్మం, చింతకాని-వెంకటాయపాలెం రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రైతులకు నచ్చేజెప్పేందుకు ప్రయత్నించగా.. విద్యుత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే తప్ప అక్కడినుంచి కదిలేదిలేదని భీష్మించారు. దీంతో విద్యుత అధికారులు రైతుల వద్దకు వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ప్రైవేటు సంస్థలకు నిరంతర సరఫరాపై రైతుల ఆగ్రహం

చింతకాని మండలం కొదుమూరు గ్రామంలోని ఓ కోల్ట్‌స్టోరేజీతో పాటు వివిధ గ్రామాల్లోని రైస్‌మిల్లులకు నిరంతరాయంగా విద్యుత సరఫరా చేస్తున్నారని, కానీ పంటలు ఎండిపోతున్నా వ్యవసాయానికి సక్రమంగా ఇవ్వకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు, రైతు సంఘాల నాయకులు విద్యుత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల నిరంతరాయంగా విద్యుత అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ రైతులను మోసగిస్తోందని, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో రైతు సంఘం నాయకులు కొండపర్తి గోవిందరావు, కొప్పుల గోవిందరావు, కన్నెబోయిన గోపి, అబ్బూరి మహేష్‌, పెంట్యాల అప్పారావు, బందెల నాగార్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:30:28+05:30 IST