మన ఊరు-మన బడి పనులను త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2023-01-25T00:34:30+05:30 IST

మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ ఆదేశించారు.

మన ఊరు-మన బడి పనులను త్వరగా పూర్తిచేయాలి

ఓదెల, జనవరి 24 : మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ ఆదేశించారు. మండలం లోని ఓదెల, కొలనూర్‌లో నిర్వహిస్తున్న మన ఊరు మన బడి పనులను కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ మంగళవారం తనిఖీలు చేశారు. అలాగే ఓదెల, కొలనూర్‌లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను పరిశీ లించారు. భీమరపల్లి, గుండ్లపల్లిలోని మన ఊరు మన బడి పనులను తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పనులను సక్రమంగా నిర్వహించడం లేదని, 10 రోజుల్లో పనులు పూర్తి చేయాలని లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చ రించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పులుగు తిరుపతిరెడ్డి, కల్లెపల్లి సరిత శ్రీనివాస్‌, సామ మనెమ్మ శంకర్‌, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో వాజీద్‌, తహసీల్దార్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:34:30+05:30 IST