అమరుల త్యాగాలు మరువలేనివి

ABN , First Publish Date - 2023-01-25T00:32:20+05:30 IST

అమరుల త్యాగాలు మరువలేనివని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

అమరుల త్యాగాలు మరువలేనివి

కోల్‌సిటీ, జనవరి 24: అమరుల త్యాగాలు మరువలేనివని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం రామగుండం కార్పొరేషన్‌ ఆ ధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో రూ.66లక్షల వ్యయంతో నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని, రాజేష్‌ థియేటర్‌ వద్ద రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన జ్యోతిరావు ఫూలే విగ్రహ జంక్షన్‌ను ఆయన పాటు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌, రామగుండం ఎమ్మెల్యే చందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ కోసం అసువులుబాసిన అమరులకు గుర్తుగా స్తూపా న్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. పోరాటాల పురిటిగడ్డ అయిన గోదావరిఖ నిలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, సింగరేణి కార్మికులు 45రోజులు సమ్మె చేయడంతో దేశం అతలాకుత లం అయ్యిందన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని యావత్‌ భారతావణి ఆ హ్వానిస్తుందని, సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించిన నాయకుడు కేసీఆర్‌ అని, కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, డిప్యూటీ మే యర్‌ అభిషేక్‌రావు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:32:20+05:30 IST