బీజేపీ విధానాలతో దేశ ప్రజల్లో ఆందోళన

ABN , First Publish Date - 2023-02-07T01:06:11+05:30 IST

సిరిసిల్ల పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాల యం ఎదుట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్‌ భారత దేశంలోని మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

బీజేపీ విధానాలతో దేశ ప్రజల్లో ఆందోళన
సిరిసిల్లలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 6: సిరిసిల్ల పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాల యం ఎదుట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్‌ భారత దేశంలోని మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ సంస్థలు అత్యంత ప్రమాదకర లావాదేవీలు, పెట్టుబడులు పెట్టాయన్నారు. ఆదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ భారీ పెట్టుబడులు పెట్టడంతో గత కొన్ని రోజులలో 39 కోట్ల మంది పాలసీదారులు రూ.33060 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ ఇతర బ్యాంకులు ఆదానీ గ్రూప్‌కు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చాయని అన్నారు. బలవంతపు పెట్టుబ డులపై పార్లమెంట్‌లో చర్చించి పెట్టుబడిదారుల డబ్బులకు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమా ర్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారయణ, పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, కార్యదర్శి వెంగళ అశోక్‌, సిరిసిల్ల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, జిల్లా మహిళ అధ్యక్షురాలు కాముని వనిత, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:06:15+05:30 IST