ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-02-07T00:57:36+05:30 IST

కరీంనగర్‌ నుంచి యాదాద్రికి ఆర్టీసీ బస్సును ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమ లాకర్‌ అన్నారు.

ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి
యాదగిరిగుట్టకు బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న మంత్రి గంగుల

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 6: కరీంనగర్‌ నుంచి యాదాద్రికి ఆర్టీసీ బస్సును ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమ లాకర్‌ అన్నారు. సోమవారం కరీం నగర్‌-1వ డిపోలో కరీంనగర్‌-యాదాద్రి బస్సు సర్వీస్‌ను జెండా ఊపి ప్రారం భించారు. ఈసందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రెండు బస్సులను ఆర్టీసీ యాదాద్రికి నడుపు తుండగా మరో రెండు కొత్త బస్సులను ఏర్పాటు చేస్తామని అన్నారు. కరీంనగర్‌ నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ఈ బస్సులు నడుస్తాయన్నారు. ఈ బస్సులు నుస్తులాపూర్‌, కొత్తపల్లి, చిగురు మామిడి, హుస్నా బాద్‌ మీదుగా యాదాద్రికి చేరుకుంటాయని పారు. అనంతరం ఆర్టీసీ క్యాలెండర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌ ఆవిష్కరించారు. ఈకార్య క్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్‌, చాడగొండ బుచ్చిరెడ్డి, దిండిగాల మహేశ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, కో అప్షన్‌ సభ్యుడు పుట్ట నరేందర్‌, ఆర్టీసీ ఆర్‌ఎం ఖుస్రోషహ్‌ఖాన్‌, డిప్యూటీ ఆర్‌ఎంలు చందర్‌రావు, బీంరెడ్డి, డిపో మేనేజర్లు ప్రణీత్‌, మల్లయ్య, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అన్ని మతాలకు సముచిత స్థానం

కరీంనగర్‌ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం మీసేవ నుంచి ఆజ్మీరు యాత్రకు వెళ్తున్న కరీంనగర్‌ నియోజకవర్గ ముస్లింల బస్సును రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింలు పవిత్రంగా భావించే అజ్మీరు దర్గాను సందర్శించే యాత్ర సఫలీకృతం కావాలని అన్నారు. ఈ యాత్రలో మొత్తం 75 మంది ముస్లింలు ఉన్నారు. ఈకార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మైనార్టీసెల్‌ నాయకుడు యూసూఫ్‌, శౌకత్‌, నవాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:57:37+05:30 IST