దొరా..నీకో దండం

ABN , First Publish Date - 2023-01-26T00:41:30+05:30 IST

దొరా..నీకో దండం.. చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నా.. ఇక ఆ పదవి నాకు వద్దు..మూడేళ్లుగా ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మున్సిపల్‌ పరిపాలనలో ప్రతీ పనిలో హు కుం జారీ చేస్తూ అనుసరిస్తున్న వైఖరి భరించలేకపోయా..

దొరా..నీకో దండం

ఎమ్మెల్యే సంజయ్‌పై శ్రావణి తీవ్ర ఆరోపణలు

తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి వేడుకోలు

కలెక్టర్‌ కార్యాలయంలో రాజీనామా పత్రం అందజేత

జగిత్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘దొరా..నీకో దండం.. చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నా.. ఇక ఆ పదవి నాకు వద్దు..మూడేళ్లుగా ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మున్సిపల్‌ పరిపాలనలో ప్రతీ పనిలో హు కుం జారీ చేస్తూ అనుసరిస్తున్న వైఖరి భరించలేకపోయా..అయినా ఎన్న డూ భయటకు చెప్పలేదు..ఏ రోజుకు ఆ రోజు నేను పడ్డ బాధలను డైరీ లో రాసుకున్నా..మంత్రి కొప్పుల ఈశ్వర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వ కుంట్ల విద్యాసాగర్‌ రావులకు ఎన్నోసార్లు విన్నవించా..బీఆర్‌ఎస్‌ ప్రతిష్ట కోసం లోపలే అనుచుకున్నా...భరించలేక ఇప్పుడు భయటపడ్డాం’..అంటూ జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్‌ శ్రావణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పట్టణంలోని తన నివాసంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌ బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. జగిత్యా ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. పదవిలోకి వచ్చిన రెండో రోజు నుంచే కుట్రలు చేశారని విలపించారు. తన కుటుంబాన్ని బెదిరింపులకు గురిచే శాడన్నారు. తిట్టినా భరించానని, ఇకమీద భరించే ఓపిక తనకు లేదని, అందుకే చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. మున్సిపల్‌ పరిపాలనలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ ఇష్టారీ తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు ఎటువంటి పరిపాలనా పరమైన స్వేచ్ఛ లేకుండా చేశాడని ఆరోపించారు. అయినా అభివృద్ధి, ప్ర జల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్లానన్నారు. నామమాత్రం గానే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశానని, అడుగడుగున ఎమ్మెల్యే సంజ య్‌ పెత్తనం చెలాయించాడని ఆరోపించారు. ఆయా సందర్బాల్లో జరిగిన సమావేశాల్లో తాను మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్లను ప్రస్తావించకూడదన్న హుకూం జారీ చేసేవారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను ఎదగడం చూడలేక అనిచివేతకు గురిచేశారని విమర్శించారు. మూడు నెలల పసిగుడ్డును ఇంట్లోనే ఉంచి నేను ప్రజలకు సేవ చేయాలని..ఓటు వేసి గెలిపించిన ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యంతో పనిచేశాననన్నారు. ఎమ్మెల్యే నుంచి తన కుటుంబానికి ఆపద పొంచి ఉందని, కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజ య్‌ కుమార్‌ బాధ్యుడు అని తెలిపారు. తన కుటుంబానికి రక్షణ కల్పిం చాలని ఎస్పీ సింధూ శర్మను కోరుతున్నాననన్నారు. కాగా తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సమర్పించినట్లు వెల్లడించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సమయంలో తనకు సహకరిం చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, నిజామా బాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:41:35+05:30 IST