మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2023-02-07T00:59:47+05:30 IST

మహిళా సంఘ సభ్యులు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించాలి
సర్టిఫికేట్లు అందిస్తున్న కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా

కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

జగిత్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘ సభ్యులు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. సోమవారం పట్టణంలోని టౌన్‌ హాలులో నాబార్డు ఆద్వర్యం లో నిర్వహించిన సాధికార మేళా- మహిళా అభ్యున్నతి వైపు ముంద డుగు-2023 ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా స్థాయి సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ ఎగ్జిబిషేన్‌ మేళాలలో వివిధ జిల్లాల నుంచి మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రద ర్శన, అమ్మకాలు, స్వశక్తి సభ్యురాళ్ల స్టాల్స్‌లను పరిశీలించారు. ఈసం దర్బంగా కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడారు. మహిళలు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు తక్కువ ధరలకే అం దించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మహిళలు కొత్త రకాల ఉత్పత్తులను, ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నా రు. ప్లాస్టిక్‌ రహిత ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. వివిధ ఉ త్పత్తిదారులను, నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్బంగా ఉ త్పత్తి దారులకు ప్రశంస పత్రాలను, జ్ఞాపికలను అందించారు. ఈ కా ర్యక్రమంలో నాబార్డు ఏజీఎం అనంత్‌, డీడీఎం మనోహర్‌రెడ్డి, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పొన్న వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, ప లువురు అధికారులు, మహిళా సంఘాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు అభినందల వెల్లువ

కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన షేక్‌ యాస్మిన్‌ బాషాకు సో మవారం అభినందనలు వెల్లువలా వచ్చాయి. పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో షేక్‌ యాస్మిన్‌ బాషాను వివిధ ప్రభుత్వ శాఖల అఽధి కారులు, ఉద్యోగులు కలిసి పుష్పగుచ్చం, పూలమొక్కలు అందించి అభి నందించారు. కాగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ని రంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడానికి అవసరమైన రెండ సబ్‌ స్టేషన్‌ నిర్మించడానికి స్థలం మంజూరు చేయాలని కలెక్టర్‌ను ట్రాన్స్‌కో అధికారులు కలిసి కోరారు. ఈకార్కయక్రమంలో అదనపు కలెక్టర్లు బీ ఎస్‌ లత, మంద మకరందులతో పాటు జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీఓలు మాదురి, వినోద్‌ కుమార్‌, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సత్యనారాయణ, డీఈలు శివరాం, రాజిరెడ్డి, రవీందర్‌, ఏడీఈ నగేశ్‌, మెప్మా పీడీ బోనగిరి నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:59:51+05:30 IST