ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-07T01:03:16+05:30 IST

ప్రజావాణిలో వచ్చిన అర్జీల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌ ఆదేశించారు.

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6 : ప్రజావాణిలో వచ్చిన అర్జీల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రజావాణి కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌లు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో 19 అర్జీలు రాగా అందులో రెవెన్యూ 6, ఎంప్లాయిమెంట్‌ 2, సిరిసిల్ల మున్సిపాల్టీ 7, వేము లవాడ మున్సిపాల్టీ 1, అర్టీసి సిరిసిల్ల 1, డీపీవో 1, చందుర్తి ఎంపీడీవో 1 చోప్పున వచ్చాయి, ఈ సందర్భంగా జిల్లా అధికారులతో జరిగిన సమా వేశంలో అదనపు కలెక్టర్‌లు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగితన పరిష్కారం చూపపడంతో పాటు అర్జీదారులకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్‌ డీఆర్వో శ్రీనివాసరావు,అధికారులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి మండలంలోని టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇందిరమ్మకాలనీలో పట్టాలు న్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాల కోసం రూ.5లక్షలు ఇవ్వలంటూ సీపీఐ తంగళ్లపల్లి మండల శాఖ అధ్వర్యంలో మండల కార్యదర్శి మంచికట్ల రమేష్‌, జిల్లా వ్యవసాయ కార్యదర్శి సోమనాగరాజులు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ను కలిసి వినతిపత్రాలను అంద జేశారు. 15 సంవత్సరాల క్రితం ఇందిరమ్మకాలనీలో 1500 మందికి ఇండ్ల నిర్మాణాల కోసం పట్టాలను ఇవ్వడం జరిగిందని ఈ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాలకు ప్రకటించిన నిధులు రాకపోవడంతో పాటు గృహ నిర్మాణాశాఖను మూసివేయడంతో ఇళ్లను నిర్మించుకోలేకపోయారన్నారు.

సిరిసిల్లలో డబుల్‌ బెడ్‌రూంలకు అర్హులై డ్రాలో పేర్లురాని వారికి ఈ నెల 12 వ తేదీలోగా ఇంటి నిర్మాణాలకు స్థలంతో పాటు రూ.5లక్షలు మంజూరు చేయాలని సీపీఎం అధ్వర్యంలో నాయకులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు వినతిపత్రం అందించారు. మూడు వేల మంది అర్హులను గుర్తించి డ్రాలో కేవలం 1800 మందికి మాత్రమే డబుల్‌ బెడ్‌రూంలను కేటాయించడం జరిగిందన్నారు. అర్హులై ఉండా డ్రాలో పేర్లు రాని 1200 మందికి ఇంటి నిర్మాణానికి రూ 5లక్షలు అందించాలని కోరారు. మరోసారి రీ సర్వే చేసి డబుల్‌ బెడ్‌రూంలు రాని వారికి ఇంటి నిర్మాణాల కోసం డబ్బులు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2023-02-07T01:03:22+05:30 IST