పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-07-02T00:28:03+05:30 IST

పద్మశాలీలు అర్థికంగా ఎదిగి అన్ని రంగాలలో రాణించాలని మద్యప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐఎస్‌ఎస్‌ అధికారి ప రికిపండ్ల నరహరి అన్నారు.

 పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి
మాట్లాడుతున్న ఐఏఎస్‌ అధికారి పరికి పండ్ల నరహరి

కోరుట్ల, జూలై 1 : పద్మశాలీలు అర్థికంగా ఎదిగి అన్ని రంగాలలో రాణించాలని మద్యప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐఎస్‌ఎస్‌ అధికారి ప రికిపండ్ల నరహరి అన్నారు. శనివారం పట్టణంలోని కటకం సంఘ య్య కల్యాణ భవనంలో జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడు రుద్ర శ్రీని వాస్‌ అధ్యక్షతన జరిగిన పద్మశాలి సంఘ అత్మీయ గౌరవ సభకు తె లుగు దేశం జాతీయ ఉపాఽధ్యక్షుడు చిలువేరి కాశినాథ్‌, రాష్ట్ర పద్మశాలి సంఘ మాజీ కన్వీనర్‌ బూర్ల మల్లేశంలతో ఐఎస్‌ఎస్‌ అధికారి నర హరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక నేతలు ప్రస్తుతం ఎదు ర్కొంటున్న సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలపై చర్చించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. రాజకీ యంగా పద్మశాలీలు ఎదిగినప్పుడే పద్మశాలీల అభివృద్ధి జరుగుతుం దన్నారు. సంఘటితంగా సమనత్వం రాజ్యాధికారం ద్వారానే మూ లా లు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్బంగా సమ్మేళనానికి విచ్చే సిన ముఖ్యఅథితులతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులను పద్మశాలి సంఘ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సం ఘ నేతలు సాంబారి ప్రభాకర్‌, బోగ వేంకటేశ్వర్ల్‌, వేముల రాం మూ ర్తి, లగిశెట్టి శ్రీనివాస్‌, గడ్డం మధు, జిల్లా దనుంజయ్‌, ఎంబేరి నాగ భూషణం, ముల్క ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-02T00:28:03+05:30 IST