కొత్త కేటాయింపులు లేవు

ABN , First Publish Date - 2023-02-07T01:28:18+05:30 IST

వడ్డింపులు లేకపోయినా సంక్షేమంపై పాత ముచ్చట తోనే బడ్జెట్‌ రూపొందింది.

కొత్త కేటాయింపులు లేవు

- టెక్స్‌టైల్‌ జోన్‌పై నిరాశే

- వేములవాడ రాజన్న ఊసేలేదు

- మిడ్‌ మానేరు, అనంతగిరి ప్రాజెక్ట్‌ల పర్యాటకంపై అయోమయం

- బడ్జెట్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిశ్రమ స్పందన

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వడ్డింపులు లేకపోయినా సంక్షేమంపై పాత ముచ్చట తోనే బడ్జెట్‌ రూపొందింది. సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హారీష్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ 2023- 24పై రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిశ్రమ స్పందన కనిపించింది. అంకెల గారడీగానే మిగిలిందని ప్రతిపక్షాలు.. జనరంజకంగా ఉందని అధికార పక్షం చెపుతున్నాయి. అమలవుతున్న సంక్షేమ పథకాలకు సం బంధించిన పద్దును పెంచడం మినహా కొత్తగా ప్రయో జనం కలిగించే విధంగా బడ్జెట్‌ పొందు పర్చలేదని విమర్శలు వస్తున్నాయి. కొత్త అసరా పింఛన్లు, రేషన్‌ కార్డుల ఊసే లేదు. గొర్రెల పంపిణీ, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రీ షియన్‌ కిట్‌, అమ్మ ఒడి, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ తో పాటు ఫించన్లు. నేతన్నకు బీమా పథకం, మత్స్య కారులు, జర్నలిస్టులు, హోంగార్డులకు రూ. 5 లక్షల ప్ర మాద బీమా గతంలో అంగన్‌వాడీ, అశా, హోం గార్డుల జీతాలపెంపు వంటివి మాత్రమే ప్రస్థావనకు వచ్చాయి.

టెక్స్‌టైల్‌ జోన్‌ కోసం ఎదురు చూపులు

కేంద్ర ప్రభుత్వం మెగా పవర్‌లూం క్లస్టర్‌కు ప్రతి బడ్జెట్‌లో ఎదురు చూపులే మిగిలిస్తుండగా రాష్ట్ర బడ్జెట్‌ లో టెక్స్‌టైల్‌ జోన్‌కు చోటు దక్కడం లేదు. ఈ సారి తెలంగాణ బడ్జెట్‌లో సిరిసిల్ల టెక్స్‌టైల్‌ జోన్‌ వంటి ప్రతిపాదనలకు మోక్షం లభిస్తుందని భావించినా నిరాశే కలిగింది. సిరిసిల్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మరమగ్గాలు, 175 చేనేత మగ్గాలపై 30 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. టెక్స్‌టైల్‌ జోన్‌ ద్వారా మరింత మెరుగైన ఉపాధి లభిస్తుందని భావిం చారు. బడ్జెట్‌లో మాత్రం తెలంగాణలో పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల, సిద్ధిపేట తదితర ప్రాంతాలు చేనేత కళకు కేంద్రాలుగా జాతీయ, అంత ర్జాతీయ ఖ్యాతిని పొందాయని ప్రస్థావించారు. చేనేత పవర్‌లూం కార్మికులకు అందిస్తున్న పథకాలను ప్రస్థా వించారు. చేనేత మిత్ర, చేనేత బీమా, ఆసరా పింఛన్లు, చేనేత కార్మికులకు రూ. లక్షలోపు రుణమాఫీ, పావలా వడ్డీరుణాలు, బతుకమ్మ చీరలతో పాటు అపెరల్‌ పార్కు ద్వారా ఉపాధి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించి చేనేత రంగాన్ని దెబ్బతీసిందని ప్రస్తావించారు. కొత్త ఊరట లేకపోవడంతో కార్మికులకు నిరాశే కలిగింది.

ఈ యేడాది మెడికల్‌ కళాశాల

ప్రారంభానికి చర్యలు

సిరిసిల్లకు గత సంవత్సరం మంజూరు చేసిన మెడికల్‌ కళాశాల ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జెఎన్‌ టీయూ తరగతలు ప్రారంభం కాగా నిధులు కేటాయిం చారు. సిరిసిల్లలో వ్యవసాయ పాలిటెక్నిక్‌, డిగ్రీ, కళాశా లలు, నర్సింగ్‌ కళాశాల, ఐటీఐ, కేంద్రీయ విద్యాలయం, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీ టు పీజీ పాఠశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యారంగం హబ్‌గా మారింది.

ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులపై జిల్లాలో అందోళనలు కొనసాగుతుండగా ఈ సారి కూడా ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల అర్థిక సాయాన్ని ప్రకటించా రు. నియోజకవర్గానికి 2 వేల మంది చొప్పున లబ్ధిదా రులను ఎంపిక చేసి సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం రూ. 7,890 కోట్లు కేటాయించారు.

అయిల్‌ఫాం సాగుకు ప్రోత్సాహం

అయిల్‌ఫాం సాగుకు ప్రభుత్వం ఈ సారి భారీ ప్రోత్సాహాన్ని అందించనుంది. 20 లక్షల ఎకరాలు సాగు లోకి తేవడంతో పాటు మొక్కలు, ఎరువులు, డ్రిప్‌ ఇరిగే షన్‌కు సబ్సిడీ ఇవ్వడానికి రూ. వెయ్యి కోట్లు కేటా యించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 1600 ఎకరాల్లో అయిల్‌ఫాం సాగు లక్ష్యం కాగా 390 మంది రైతులు 1280 ఎకరాల్లో సాగు చేశారు.

దళితబంధుపై అశలు

జిల్లాలో దళితబంధుపై అశలు పెరిగాయి. ఈ సారి రూ 12,980 కోట్లు దళితబంధుకు కేటాయించారు. జిల్లా లోని నియోజకవర్గానికి వంద మంది ని ఎంపిక చేయ గా ఈ సారి నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారు లను ఎంపిక చేయనున్నారు.

వేములవాడ రాజన్నపై చిన్నచూపే

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై చిన్న చూపే కొనసాగుతోంది. బడ్జెట్‌లో యాదాద్రి దేవస్థానం అభివృద్ధిపై గొప్పగా ప్రస్తావించారు. వేములవాడ దేవస్థానానికి రూ. 400 కోట్ల వరకు కేటాయిస్తామన్నా నిధులపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది.

మిడ్‌ మానేరు పర్యాటకంపై అయోమయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నుంచి మొదలుకొని అనంతగిరి, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌ వరకు పర్యాటకంగా తీర్చిదిద్తుతా మని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2021లో ప్రకటిం చారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లపై పర్యాటకంకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు కనిపించకపోగా గతంలో ఏర్పా టు చేసిన బోటు విహార యాత్ర కూడా ప్రారంభిం చలేకపోయారు.

రుణమాఫీ ఊరటనిచ్చేనా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 61,773 మంది వ్యవసాయ రుణమాఫీ అర్హులుగా గుర్తించారు. ఇప్పటివరకు రెండు విడతల వరకే రుణమాఫీ జరిగింది. ఈ బడ్జెట్‌లో రుణ మాఫీ నిధులు కేటాయించండతో అర్హులు ఎదురు చూస్తున్నారు.

పద్దుల్లో వాటా ఎంత

బడ్జెట్‌లో కేవలం అయా శాఖలకు సంబంధించి పద్దులు మాత్రమే ప్రకటించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయ, పశుసంవర్థకం, మత్స్యశాఖ, వైద్య అరోగ్య, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, పరిశ్రమలు నీటి పారుదల, మైనార్టీ సంక్షేమం, పంచాయతీరాజ్‌, గ్రా మీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, వెనకబడిన తర గతులు ఇలా అయా శాఖలకు భారీగా బడ్జెట్‌లు కేటా యించారు. ఆ బడ్జెట్‌లో జిల్లాకు వచ్చే వాటా ఎంత అనే దానిపై ప్రజలు అయోమయంలోనే ఉన్నారు.

Updated Date - 2023-02-07T01:28:22+05:30 IST