మార్మోగిన మార్కండేయుడి నామస్మరణ

ABN , First Publish Date - 2023-01-25T00:33:48+05:30 IST

శివభక్త మార్కండేయస్వామి నామస్మరణ మార్మోగింది. మహిళలు, విద్యార్థుల కోలాట నృత్యాలు, జనసందోహం మధ్య మార్కండేయ స్వామి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది.

మార్మోగిన మార్కండేయుడి నామస్మరణ
సిరిసిల్లలో శోభాయాత్రలో జనం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

శివభక్త మార్కండేయస్వామి నామస్మరణ మార్మోగింది. మహిళలు, విద్యార్థుల కోలాట నృత్యాలు, జనసందోహం మధ్య మార్కండేయ స్వామి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. మంగళవారం మార్కండేయుని జయంతి సందర్భంగా సిరిసిల్ల పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి దేవస్థానంలో మహాయజ్ఞాలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక వాహనంపై మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహంతో శోభాయాత్ర ప్రారంభించారు. మార్కండేయుని దేవస్థానం నుంచి బయలు దేరిన శోభాయాత్ర గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, చేనేత చౌక్‌, పెద్దబజార్‌ మీదుగా వేంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా కొనసాగింది. శోభాయాత్రకు వేలాదిగా తరలి వచ్చిన పద్మశాలీలు, మార్కండేయ స్వామి భక్తులు నృత్యాలు చేస్తూ మార్కండేయుని నామస్మరణ చేశారు. శోభాయాత్రలో పద్మబ్రహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో గాంధీ, అంబేద్కర్‌, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. జయంతి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డేతోపాటు అధికారులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారాయణ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌, పద్మశాలి సంఘం ప్రతినిధులు బొల్లి రామ్మోహన్‌, డాక్టర్‌ గాజుల బాలయ్య, మ్యాన రవి, మోర రవి, కోడం శ్రీనివాస్‌, టెక్స్‌టైల్‌ పార్కు అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ అనిల్‌, వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం, కార్యదర్శి వెల్దండి దేవదాస్‌, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ, పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, సెస్‌ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, దిడ్డి రమాదేవి, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:33:54+05:30 IST