బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

ABN , First Publish Date - 2023-02-07T01:22:16+05:30 IST

రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు మిశ్రమ స్పందన లభించింది.

 బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

- అన్ని వర్గాలకు ఊరట అంటున్న గులాబీ నేతలు

- అంకెల గారడి అంటున్న ప్రతిపక్షాలు

జగిత్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు మిశ్రమ స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జి ల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకున్నా, రాష్ట్రంలో జిల్లా వాటాగా ప లు రకాలుగా నిధులు పొందనుంది. ఈ బడ్జెట్‌ వ్యవసాయ రంగానికి పె ద్దపీట వేయగా, ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచా రు. దళితులకు ప్రత్యేకంగా దళిత బందు పథకం, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ, గౌడ, మహిళలకు సంక్షేమ పథకాల కొనసాగింపు వంటివి జిల్లా ప్రజలకు మేలు చేకూర్చనున్నాయి. బడ్జెట్‌లో జిల్లాకు చేకూరే లబ్ధి గతంతో పోలిస్తే సాగు, సంక్షేమంలో స్వల్పంగా మెరుగు కనిపిస్తోంది.

ఉన్న పథకాలకే మెరుగులు...

బడ్జెట్‌లో అంతగా కొత్త పథకాలు ఏవీ లేకున్నాప్రస్తుతం అమలు చే స్తున్న పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లుగా బడ్జెట్‌లో ప్రకటించారు. డ బుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల స్థానంలో సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణా నికి నిధులు సమకూరుస్తున్నట్లు బడ్జెట్‌ రూపొందించారు. స్థానిక సంస్థల కు ఊరట కల్పిస్తూ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉ న్నట్లు మంత్రి హరీశ్‌ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులతో పాటు ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో వెల్లడిం చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతు లు, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ పంచాయతీ రాజ్‌ శాఖకు వి డుదల చేయడానికి సర్కారు నిర్ణయించింది.

కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు..

పలు ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తీపి కబురు అందించింది. ఏప్రిల్‌ నుంచి కాంట్రా క్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం నెలకు రూ. 3 వేలకు పెంచిం ది. సెర్ఫ్‌ ఉద్యోగులకు ఏప్రిల్‌ నుంచి పేస్కేల్‌ సవరణ చేయబోతున్నట్లు గా మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విన తుల మేరకు నూతన ఈహెచ్‌ఎస్‌ విధానాన్ని అమలు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా తెలిపింది.

పత్తాలేని నిరుద్యోగ భృతి...గిరిజన బంధు..

నిరుద్యోగ భృతి, గిరిజన బంధు లాంటి పథకాల అమలును పట్టించుకోక పోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరు ద్యోగ భృతి, గిరిజన బంధు పథకాల ఊసెత్తకపోవడంతో సంబందిత వర్గా లకు నిరుత్సాహానికి గురవుతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న మనఊరు-మనబడి కార్యక్రమానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

వ్యవసాయ పథకాలతో జిల్లాకు లబ్ధి..

రోజురోజుకూ పెరిగిపోతున్న సాగు ఖర్చుల నుంచి రైతులకు ఊరట కలి గించేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తె లిసిందే. ఈ పథకం కింద సర్కారు ఒక్కో ఎకరానికి రూ. 5వేలు ఆర్థిక స హాయం అందిస్తోంది. మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 26,831 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దీంతో జిల్లాలో సుమారు లక్ష మంది రై తులకు లబ్ధి చేకూరనుంది. రైతు బీమా కింద జిల్లాలో ఒక్కో సీజన్‌లో సు మారు 1.20 లక్షల మంది రైతులకు రైతు బీమా పథకానికి అర్హులుగా ఉ న్నారు. రైతు రుణ మాఫీకి ప్రత్యేక నిధులు కేటాయించగా జిల్లాలో సుమా రు 1.20 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారు.

సంక్షేమ పథకాలు పరుగులు...

జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తుండడంతో జిల్లాలో సంక్షేమం సైతం పరుగులు పెట్టనుంది. సంక్షేమ శాఖలోని పలు పథకాలకు ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులను కేటాయించింది. గిరిజన సంక్షేమానికి రూ. 3,965 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 6,229 కోట్లు, మైనార్టీ సంక్షేమానికిరూ. 2,200 కోట్లు, షె డ్యూల్‌ కులాల సంక్షేమానికి రూ. 21,022 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 117 కోట్లు కేటాయించింది.

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు లేవు...

జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో మోక్షం లభించలేదు. సారంగపూర్‌, ధర్మపురి తదితర ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి గానూ నిర్మిస్తున్న రోళ్లవాగు ప్రాజెక్టు, బొళ్లి చెరువు పనులకు నిధుల కే టాయింపు జరగలేదు. కథలాపూర్‌ మండలంలో రూ. 204 కోట్లతో నిర్మిం చాలనుకున్న సూరమ్మ రిజర్వాయర్‌ కేవలం ప్రతిపాదనలకే పరిమితమ మైంది. జగిత్యాల-నిర్మల్‌ జిల్లాల మద్య మూలరాంపూర్‌ వద్ద రూ. 520 కోట్లలో నిర్మించతలపెట్టిన సదర్‌మట్‌ బ్యారేజీ పనులు నత్తనడకన జరుగు తున్నాయి.. జిల్లాలో ఏకైకా వ్యవసాయ కర్మాగారంగా గుర్తింపు పొందిన ని జాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ కర్మాగారం పునరుద్ధరణ ఊసును బడ్జెట్‌లో ఎత్తలేదు.

సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు రూ. 3 లక్షల సాయం...

సొంత స్థలాలు ఉన్న వ్యక్తులు ఇళ్లు నిర్మాణాలకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రతీ నియో జకవర్గానికి 3వేల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వా రా జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలతో పాటు చొప్ప దండి, వేములవాడ నియోజకవర్గాల పరిదిలోని మండలాల్లో సుమారు 10 వేల ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

ప్రజారంజక బడ్జెట్‌

- కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జగిత్యాల

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రవేపెట్టిన బడ్జెట్‌ ప్రజారంజకంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమం రెండు గుర్రాలుగా ఉండేవిధంగా బడ్జెట్‌ను రూ పొందించారు. అన్ని వర్గాలకు సామాన ప్రాధాన్యతనిచ్చారు. సాగు, తాగు నీటి రంగాలకు నిధుల కేటాయింపు జరిగింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు జరిపారు.

అన్ని వర్గాల ఆమోదయోగ్యంగా బడ్జెట్‌

- డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

సమాజంలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ పేద వాడి ఇంటి కల నెరవేర్చడమే కా కుండా, కడుపు నింపే విదంగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్‌ రూపకల్పన చేశారు. రైతులు, మహిళలు, మైనా ర్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందనున్నాయి.

పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్‌

కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రజలు మెచ్చుకునే విధంగా బడ్జెట్‌ ఉంది. ప్రధానంగా రైతులు, యు వత, వృద్ధులు, మహిళలు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వే శారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా బడ్జెట్‌ కేటాయింపులు సమానం గా జరిపారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్‌ కేటాయిం పులు జరిపారు.

అంకెల గారడీ..

మోరపల్లి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు,

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీగా ఉంది. పలు ప్ర భుత్వ శాఖలకు, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లో నిధులు కోతలు పెట్టారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయాలన్న అన్నదాతల డిమాండ్‌ను పట్టించుకోలేదు.

ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు ఏవీ..?

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు,

గతంలో జిల్లా ప్రజలకు సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బ డ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగలేదు. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలకు అ వసరమైన నిధులు కేటాయించలేదు. పేద ప్రజల సంక్షేమానికి, పల్లెలు, పట్టణాల అభివృద్ధిని ప్రభుత్వ విస్మరించింది. ప్రభుత్వం అంకెల గారడీగా బడ్జెట్‌ తయారయింది.

కాగితపు లెక్కలకే పరిమితం

మహంకాలి రాజన్న, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాగితపు లెక్కలకే పరిమితం. కాగి తాల్లో కనబడే లెక్కలు, వాస్తవరూపంలో కనుమరుగయ్యేలా ఉంది. ప్రవే శపెట్టిన బడ్జెట్‌కు, చేసే వ్యయానికి పొంతన కుదరడం లేదు. ప్రజలకు వా స్తవాలను దాచిపెడుతూ ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది.

ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‌

పుప్పాల లింబాద్రి, బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలను మభ్యపెట్టేవిధంగా ఉంది. ని రుద్యోగ భృతి ప్రస్తావించలేదు. గిరిజన బంధు జాడ లేకుండా పోయింది. విద్యా, వైద్య రంగాలకు అంతంతమాత్రంగానే నిధుల కేటాయింపు జరిగిం ది. సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణ దారులకు రూ. 5 లక్షలకు బదులుగా రూ. 3 లక్షలు కేటాయించడం విచారకరం.

Updated Date - 2023-02-07T01:22:21+05:30 IST