కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-26T00:05:56+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లి రూరల్‌, జనవరి 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని రాఘవపూర్‌ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభు త్వం దవాఖానాలను ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతోంద ని అన్నారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవా రికి ఉచితంగా అద్దాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బం డారి స్రవంతి-శ్రీనివాస్‌ గౌడ్‌; మండల పార్టీ అధ్యక్షులు మార్కు లక్ష్మణ్‌, పిఏసిఎస్‌ చైర్మన్‌లు దాసరి చంద్రారెడ్డి, మాదిరెడ్డి నరసింహరెడ్డి, సర్పం చ్‌ ఆడెపు వెంకటేషం, ఎంపీటీసీ శ్రీనివాస్‌, గ్రామ శాఖ అధ్యక్షులు కొము రయ్య, తాడిశెట్టి శ్రీకాంత్‌, గాండ్ల సతీష్‌, సదయ్య, రమేష్‌ శ్రీనివాస్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:05:56+05:30 IST