Share News

కార్మికులను మోసం చేసిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2023-11-21T23:16:08+05:30 IST

ప్రభుత్వం సింగరేణి సంస్థను అమ్మకానికి పెట్టిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ గెలిస్తే సింగరేణి భవిష్యత్‌ ఉండదని కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు.

కార్మికులను మోసం చేసిన కేసీఆర్‌

కోల్‌సిటీ, నవంబరు 21: ప్రభుత్వం సింగరేణి సంస్థను అమ్మకానికి పెట్టిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ గెలిస్తే సింగరేణి భవిష్యత్‌ ఉండదని కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. మంగళవారం సంఘటిత, అసంఘటిత జిల్లా కన్వీనర్‌ పెంచాల తిరుపతి ఆధ్వ ర్యంలో జీడీకే 11ఇంక్లైన్‌లో కార్మికులతో జరిగిన సమావేశంలో మక్కాన్‌సింగ్‌ మాట్లాడారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో మరోమారు బీఆర్‌ఎస్‌ వస్తే కంపెనీ ఉండే పరిస్థితే ఉండదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సింగరేణి ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మరిన్ని గనులు సింగరేణి ఆధ్వర్యంలో తెరిపిస్తామన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను మాఫీ చేయించడం, గోదావరిఖనిలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేయడం, కార్మికుల సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్‌ పార్టీ ఎజెండా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారుపేరు కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్మికులకు అండగా ఉంటుం దని, ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌, ఉమ్మడి రాష్ట్రాల ఉపాధ్యక్షులు గుమ్మడి కుమారస్వామి, నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ నాయకుడు ఆరెల్లి పోషం, కే స్వామి, సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ధర్మపురి, ఆర్‌జీ-1 వైస్‌ ప్రెసిడెంట్‌ సదానందం, నాయకులు వికాస్‌కుమార్‌, రాజేందర్‌, గడ్డం కృష్ణ, యెట్టం కృష్ణ, సమ్మయ్యయాదవ్‌, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్‌, తాళ్ల కుమార్‌, రాజిరెడ్డి, శ్రీనివాస్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:16:13+05:30 IST