టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై కాంగ్రెస్‌ నిరసనలు

ABN , First Publish Date - 2023-03-20T00:28:15+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి మెంటం ఉద య్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలో నిరస న వ్యక్తం చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై కాంగ్రెస్‌ నిరసనలు

కోల్‌సిటీటౌన్‌, మార్చి 19: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి మెంటం ఉద య్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలో నిరస న వ్యక్తం చేశారు. స్థానిక ప్రధానచౌరస్తాలో నల్లబ్యాడ్జీ లు ధరించి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదలు చేసి నిరుద్యో గులకు ఆశలు చూపి పరీక్షలు నిర్వహించాక ప్రశ్నప త్రాల లీకేజీలతో వారి జీవితాలతో ఆటలాడుతున్నద న్నారు. ఎన్నికల కోసం ఇలాంటి ఉద్యోగాల భర్తీ చేస్తు న్నామని నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని ఈ తతంగం చూస్తుంటే అర్థం అవుతుందన్నారు. ప్రశ్నపత్రాల లీకే జీ వ్యవహరంలో ఉన్న ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లీకేజీలు జరిగాయని, ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ గానీ, సీఎం గానీ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నా యకులు వంశీ, వాసు, శ్రీరామ్‌, శ్రీమా న్‌, వినయ్‌, సుమంత్‌, నాని, శివ, నాగ రాజ్‌,అఖిలేష్‌, రాకేష్‌, హరిప్రసాద్‌, శ్రవ ణ్‌, రికి, జాన్‌, అభిషేక్‌, పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:28:15+05:30 IST