సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2023-02-07T01:01:44+05:30 IST

రాష్ట్రంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందడం కోసం ప్రతి ఒక్కరం చేయి కలుపుదా మని డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి
దర్మపురి లో హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌లో పాల్గొన్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందడం కోసం ప్రతి ఒక్కరం చేయి కలుపుదా మని డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సోమవారం ఉదయం పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మణ్‌కుమార్‌ హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ను పలువురు కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతిని ధులు, నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్‌ నేతలు, కా ర్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆయన యాత్ర ని ర్వహించారు. దేవాలయం వద్ద నుంచి ప్రారంభించిన యాత్ర అంబేడ్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ బీ ఆర్‌ఎస్‌ బందిపోట్ల రాక్షస సమితిగా మారిందని ఆరోపించారు. సీఎం కేసీ ఆర్‌ దగా తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ఎన్నిక ల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించే వరకు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపాలని అన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగి, సంక్షేమ పథకాలకు నిధులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దళిత, గిరిజన, రైతు ల ను దగా చేసి రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మొదటి రోజు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం హాత్‌ సే హాత్‌ జోడ్‌ అభియాన్‌ ముగించారు. ఈ కార్యక్రమంలోటీపీసీసీ కార్యవర్గ సభ్యులు సంగనభట్ల దినేష్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు గుండ మధు, కౌన్సిలర్లు నాగలక్ష్మి, సంతోషి, పద్మ, అరుణ,మండల ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, రాజేందర్‌, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షులు సింహరాజు ప్ర సాద్‌, మండల అధ్యక్షులు మొగిలి, పట్టణ అధ్యక్షులు తిరుపతి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:01:47+05:30 IST