కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్‌

ABN , First Publish Date - 2023-02-07T01:03:47+05:30 IST

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్లకు అ నుకూలంగా తయారు చేసినట్లు ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆరో పించారు.

కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్‌
సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌ రెడ్డి

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

జగిత్యాల అర్బన్‌, ఫిబ్రవరి 6: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్లకు అ నుకూలంగా తయారు చేసినట్లు ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆరో పించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం బలహీనవర్గాలకు మొం డిచేయిచూపి, కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తోందన్నారు. కూలీల పొట్టకొట్టేలా కేంద్రం ఈజీఎస్‌ పథకానికి రూ.30వేల 500కోట్లు బడ్జెట్‌ తగ్గించడం దుర్మార్గపు చర్య అన్నారు. అదే కార్పొరేట్‌ సం స్థలకు వరాలు కురిపించి వారి ఉన్నతికి కృషి చేస్తుందన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలా లు, పక్కా ఇళ్లు, ఉపాధి, విద్య, వైద్యం, కనీస వసతులతో కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. అదాని షేర్ల విలువ పడి పోవడంతో బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగవేసే అవ కాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 12లక్షల కోట్ల మేర కార్పొరేట్‌ సంస్ధలకు మొండి బకాయిలు పేరిట రుణమాఫీ చేయడం దుర్మార్గమన్నారు. ఇప్ప టికే పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ప రం చేయగా బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం కుటిలయత్నం చేస్తోందన్నారు. అసలైన నిరుపేదలకే దళితబంఽధు ద్వారా ఆర్థికసాయం అందించాలని, ఈ విషయాలపై సీఎం కేసీ ఆర్‌ వెంటనే స్పందించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని వెంకట్‌రెడ్డి కోరారు. ఈ సమా వేశంలో సీపీఐ నాయకులు ఎండీ ముఖ్రం, వెన్న సురేష్‌ తదితరులున్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఎత్తివేతకు ప్రభుత్వ కుట్ర

సీపీఐ(ఎం) జిల్లా ప్రజాసంఘాల కన్వీనర్‌ తిరుపతి

జాతీయ గ్రామీణ ఉపాఽధిహామి పథకం ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దీని నిదర్శనం బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు నిధులు తగ్గించడమేనని సీపీఐ(ఎం) జిల్లా ప్రజాసంఘాల కన్వీనర్‌ తిరుపతి నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ వైపు పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం దురదృ ష్టకరం అన్నారు. ఇళ్ల స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చిందని, కానీ కార్పోరేట్‌ శక్త్థులకు మాత్రం బడ్జెట్‌లో పట్టం కట్టిందని ఆరోపించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ ఇందూరి సులోచన, సీపీఎం జిల్లా సీనియర్‌ నాయకుడు భూతం సారంగపాణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చల వినోద్‌ కుమార్‌, సీఐటీయూ జిల్లా కోకన్వీనర్‌ ముడుగం రాజలింగు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:03:50+05:30 IST