కాకతీయ మినీ కెనాల్లో మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2023-01-26T00:05:45+05:30 IST

మండలంలోని తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ మినీ కెనాల్లో ఓ వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది.

కాకతీయ మినీ కెనాల్లో మృతదేహం లభ్యం

హుజూరాబాద్‌ రూరల్‌, జనవరి 25: మండలంలోని తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ మినీ కెనాల్లో ఓ వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన కాశిరెడ్డి చిరంజీవి అనే రైతు తన పొలం వద్దకు వెళ్లాడు. పక్కనే ఉన్న కెనాల్లో చూడగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా ఆధార్‌కార్డు లభించింది. వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం దబిడిపేట గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేష్‌ (48) అనే వ్యక్తిగా గుర్తించారు. రమేష్‌ బోర్వెల్‌ యజమాని గొలుసుల మోహన్‌బాబు దగ్గర క్రిష్ణన్‌కుమార్‌ గుప్తాతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతుడు మద్యం తాగి కాలు జారి కెనాల్‌లో పడి మృతి చెంది ఉంటాడని కాశిరెడ్డి చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజన్న తెలిపారు. కాగా మృతదేహాన్ని హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

Updated Date - 2023-01-26T00:05:45+05:30 IST