చీడపీడల నివారణపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2023-01-25T01:03:16+05:30 IST
వరిలో చీడపీడల బెడద అధికమవుతున్న తరుణంలో క్షేత్రస్ధాయిలో అధికారులు పర్యటించి, పరిస్థితిని అంచనా వేసి, వాటి నివారణకు రైతులకు అవగాహన కల్పించడం వ్యవసాయ శాఖ అఽధికారుల బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్‌కుమార్ అన్నారు.

జగిత్యాల అర్బన్, జనవరి 24: వరిలో చీడపీడల బెడద అధికమవుతున్న తరుణంలో క్షేత్రస్ధాయిలో అధికారులు పర్యటించి, పరిస్థితిని అంచనా వేసి, వాటి నివారణకు రైతులకు అవగాహన కల్పించడం వ్యవసాయ శాఖ అఽధికారుల బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియో జకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సాగు మెళకువలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. రైతులు సైతం ఫెస్టిసైడ్లు అధికంగా వాడడం వ ల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, అందువల్ల ఎరువుల వాడకాన్ని రై తులు తగ్గించుకోవాలన్నారు. బుథవారం నుంచి అధికారులు క్షేత్రస్ధాయిలో అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాండం తొలిచే పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యా లెండర్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి బాధ్యులు దామోదర్‌రావు, బాల ముకుందం, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ప్యాక్స్ ఛైర్మె న్ మహిపాల్ రెడ్డి, సందీప్‌రావు, ఏఎంసీ డైరెక్టర్ దమ్మరాజిరెడ్డి, ఇన్చార్జి డీఏవో కల్పన, ఏవో తిరుపతి, వినీల, ముక్తేశ్వర్, ఏఈవోలు పాల్గొన్నారు.