నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు

ABN , First Publish Date - 2023-01-26T01:15:33+05:30 IST

మత సామరస్యాని కి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు నేటినుం చి ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుం చి కుల,మతాలకు అతీతంగా వేలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలపై అనుమానాలు ఉన్నాయి. దర్గాకు వచ్చే భక్తుల కు ఇబ్బందులు తలెత్తితే సహించేది లేదని ఇటీవల పాలకవీడులో జరిగినస మావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మోహన్‌రావు, ఆర్డీవో వెంకారెడ్డి వక్ఫ్‌బోర్డు అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించినావారిలో మార్పు వచ్చినట్లు కన్పించడం లేదు.

నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు

నామమాత్ర ఏర్పాట్లతో ప్రారంభం

కాంట్రాక్టర్లు లేరు.. వక్ఫ్‌బోర్డు అధికారులూ పట్టించుకోరు

పాలకవీడు, జనవరి 25: మత సామరస్యాని కి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు నేటినుం చి ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుం చి కుల,మతాలకు అతీతంగా వేలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలపై అనుమానాలు ఉన్నాయి. దర్గాకు వచ్చే భక్తుల కు ఇబ్బందులు తలెత్తితే సహించేది లేదని ఇటీవల పాలకవీడులో జరిగినస మావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మోహన్‌రావు, ఆర్డీవో వెంకారెడ్డి వక్ఫ్‌బోర్డు అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించినావారిలో మార్పు వచ్చినట్లు కన్పించడం లేదు. ఈనెల26, 27, 28వ తేదీల్లో ప్రారంభమయ్యే ఉర్సుకు వక్ఫ్‌బోర్డు నుంచి రూ.8లక్షలు మాత్రమే మంజూరు చేశారు. అవికూడా లడ్డూలు,కొబ్బరికాయల విక్రయాలు,ఇత ర కాంట్రాక్టర్ల ద్వారా వసూలు చేసి ఉర్సు నిర్వహించాలని వక్ఫ్‌బోర్డునుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

భారీ బందోబస్తు

ఉర్సుకు భారీగా భక్తులు వస్తుండడంతో పోలీ్‌సశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వాహనాలనులోనికి అనుమతించకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పా ర్కింగ్‌ స్థలాల్లోనే వాహనాలు నిలిపివేయనున్నారు. గంధం ఊరేగింపు రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరు.ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు, వీఐపీలను మాత్రమే అనుమతిస్తారు. దర్గాకు ఇరువైపులా, దామరచర్ల వైపు, నేరేడుచర్ల వైపు 13ఎకరాల్లో పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు.

అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు

ఉర్సులో ఇబ్బందులు తలెత్తకుండా రాత్రి సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేందుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తున్నారు. సాంకేతిక లోపం ఏర్పడితే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతారు.

నిరంతరాయంగా తాగునీటి సరఫరా

భక్తులకు తాగునీరు అందించేందుకు దక్కన్‌ సిమెంట్‌ యాజమాన్యం ముందుకొచ్చింది. ముందు రోజునుంచే దర్గా పరిసరాల్లో డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉంచుతున్నారు. దర్గా పరిసరాల్లో దుమ్ము లేవకుం డా రహదారులపై నీటిని చల్లించనున్నారు. అదేవిధంగా 20తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

వైద్య శిబిరాలు ఏర్పాటు

రెండుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి భక్తుల కు కావాల్సిన మందులు సరఫరా చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ను సిద్ధం చేశారు.

వక్ఫ్‌బోర్డు అధికారుల్లో మార్పు వచ్చేనా?

పాలకవీడులో ఇటీవల జరిగిన వక్ఫ్‌బోర్డు సమావేశంలో అధికారులపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వక్ఫ్‌బోర్డు అధికారుల్లో మార్పురాలేదు. ప్రతి ఏటా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు వక్ఫ్‌బోర్డుకు వస్తున్నా పట్టుమని రూ.10 లక్షలు కూడా దర్గా అభివృద్ధికి ఖర్చు చేయకపోవడంతో భక్తులు ప్రతి ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉర్సు సమయంలో ఒకసారి సమావేశం నిర్వహించి మమ అన్పిస్తున్నారు తప్ప శాశ్వత నిర్మాణాలు, టాయిలెట్లు, స్నానపు గదుల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటివి చేపట్టక పోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాన్‌పహాడ్‌ దర్గా అభివృద్ధికి రూ.50లక్షలు

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

జాన్‌పహాడ్‌ దర్గా వద్ద మౌలిక సదుపాయాల కోసం ఎస్డీఎస్‌ నిధుల నుంచి సీఎం కేసీఆర్‌ రూ.50లక్షలు కేటాయించారని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. బుధవారం జాన్‌పహాడ్‌ దర్గాను దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాల పేరుతో భక్తుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉర్సుకు మంత్రులు మహమూద్‌ అలీ, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఉర్సు ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, దర్గారావు, సత్యనారయణరెడ్డి, సైదులు, శేషు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:15:38+05:30 IST