పోచంపల్లిలో విగ్రహాల వివాదం

ABN , First Publish Date - 2023-02-01T00:51:57+05:30 IST

భూ దాన్‌పోచంపల్లిలో విగ్రహాల వివాదం నెలకొంది. ప్రధాన రహదారిపై నేతాజీ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపల్‌ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకున్నా రు. దీంతో యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు నేతాజీ జయంతి రోజున గత నెల 23న తడక వెంకటేష్‌, సార బాలయ్యలు నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని పోలీ్‌సస్టేషన్‌ వద్ద రోడ్డు మధ్యలో కొత్తగా నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పద్మశాలి మహాజన సంఘం సంకల్పిం చి, భారీగా విరాళాలు సేకరించింది.

పోచంపల్లిలో విగ్రహాల వివాదం

రోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేయడంపై గరంగరం

నేతన్న విగ్రహ ఏర్పాటుపై రగడ

పనులు నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

భూదాన్‌పోచంపల్లి, జనవరి 31: భూ దాన్‌పోచంపల్లిలో విగ్రహాల వివాదం నెలకొంది. ప్రధాన రహదారిపై నేతాజీ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపల్‌ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకున్నా రు. దీంతో యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు నేతాజీ జయంతి రోజున గత నెల 23న తడక వెంకటేష్‌, సార బాలయ్యలు నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని పోలీ్‌సస్టేషన్‌ వద్ద రోడ్డు మధ్యలో కొత్తగా నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పద్మశాలి మహాజన సంఘం సంకల్పిం చి, భారీగా విరాళాలు సేకరించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఆర్‌అండ్‌బీ ఏఈ విజ య్‌ జనవరి 30న స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కానీ, ఎస్‌ఐ సైదిరెడ్డి మాత్రం తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు వ్యవహా రం నడిచినట్లు తెలుస్తోంది. భూదాన్‌పోచంపల్లి పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో రోడ్డు డివైడర్‌ వద్ద కాకుండా మధ్యలో విగ్రహ ఏర్పా ట్లు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేతన్న విగ్రహ ఏర్పాటుకు ఎవరూ అభ్యంతరం తెలపడం లేదు కానీ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తే మంచిదని అంటున్నారు. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు, వాహనదారులకు తీవ్ర అసౌకర్యాలు కలిగే అవకాశం ఉందంటున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి ముందస్తుగా అనుమతిలేని కారణంగా ఈ ప్రదేశంలో పనులు నిలిపివేయాలని కోరుతూ సంబంధిత శాఖ అధికారి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విష యం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఎస్‌ఐ సైదిరెడ్డి మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నా రు. పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు మాట్లాడుతూ తాము ఎవరి వద్ద అనుమతులు తీసుకోలేదని చెప్పారు. విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని ఆహ్వానించామని, గణతంత్ర వేడుకలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నందున అక్కడికి వెళ్లడంతో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో శంకుస్థాపన చేయించామన్నారు.

నేతాజీకి ఒకన్యాయం.. నేతన్నకు ఒక న్యాయమా ?

భూదాన్‌పోచంపల్లిలోని పోలీ్‌సస్టేషన్‌ వద్ద రోడ్డు మధ్యలో నేతన్న విగ్రహావిష్కరణకు ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్మాణ పనులు చేయడంపై నేతాజీ యువజన సంఘం ప్రతినిధులు ఆక్షేపణ తెలిపారు. నేతన్న విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కేవలం వారి విధానం పట్ల ఆక్షేపణ తెలుపుతున్నామని స్పష్టంచేశారు. మంగళవారం నేతాజీ యువజన సంఘం ప్రతినిధులు గునిగంటి రమే్‌షగౌడ్‌, శెట్టి శ్రీనివా్‌సముదిరాజ్‌, ముప్పిడి శ్రీనివా్‌సగౌడ్‌, బొడిగె లింగంగౌడ్‌, కీర్తి సంజీవ, జింకల జయసూర్య మాట్లాడుతూ నేతన్న విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, రోడ్డు మఽధ్యలో కాకుండా డివైడర్ల మధ్య ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు.

Updated Date - 2023-02-01T00:51:58+05:30 IST