క్రీడల్లో గెలుపోటములు సహజం

ABN , First Publish Date - 2023-01-26T00:38:28+05:30 IST

క్రీడలలో గెలుపోటములు సహజమేనని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు.

క్రీడల్లో గెలుపోటములు సహజం

రాజేంద్రనగర్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): క్రీడలలో గెలుపోటములు సహజమేనని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. రాజేంద్రనగర్‌ నవజ్యోతి యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ, వాలీబాల్‌ ఓపెన్‌ టు ఆల్‌ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. వాలీబాల్‌ పోటీలను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ప్రారంభించగా, కబడ్డీ పోటీలను టీఎన్‌జీవోస్‌ హైదారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎం హుస్సేనీ ముజీబ్‌ యూత్‌ క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ఎస్‌.అమరేందర్‌, ఎం.నాగభూషణం, క్రీడల కార్యదర్శి ఎం.కార్తీక్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ పి.అర్చన జయప్రకాశ్‌, రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌, బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్‌, వివిధ పార్టీల నాయకులు, యూత్‌ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ముజీబ్‌ మాట్లాడుతూ, 74వ గణతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నవజ్యోతి యూత్‌ క్లబ్‌ ప్రతినిధులు పోలీసుల సహకారంతో క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. నవజ్యోతి యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.అమరేందర్‌ మాట్లాడుతూ, కబడ్డీ, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనడానికి 45 జట్లు వచ్చాయన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ. 25వేలతో పాటు షీల్డ్‌, ద్వితీయ బహుమతిగా రూ. 15వేలతో పాటు షీల్డ్‌, తృతీయ బహుమతి రూ. 10వేలతో పాటు షీల్డ్‌ను అందజేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో యూత్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.వై.డానియేల్‌, జి.రాములు, మాజీ అధ్యక్షులు ఎస్‌.జగదీశ్వర్‌, ఎం.ఎ నయీమ్‌, బి.పద్మారావు, పి.ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పలుగుచెరువు మహేశ్‌, ఎం.యాదమ్మ యాదవ్‌, రగడంపల్లి శ్రావణ్‌, యూత్‌ క్లబ్‌ పాలకవర్గ సభ్యులు కనకమామిడి ప్రవీణ్‌కుమార్‌, ఎం.ప్రవీణ్‌కుమార్‌, వీర్లపల్లి నవీన్‌, ఎ.సుబ్బారావు, వీర్లపల్లి మహేశ్‌, జి.శ్రీనివాస్‌, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:38:31+05:30 IST