పఠాన్‌’ను అడ్డుకుంటాం : బజరంగ్‌ దళ్‌

ABN , First Publish Date - 2023-01-26T00:33:05+05:30 IST

పఠాన్‌ సినిమాను గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించకుండా అడ్డుకొని తీరుతామని బజరంగ్‌దళ్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ శివరాములు బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

పఠాన్‌’ను అడ్డుకుంటాం : బజరంగ్‌ దళ్‌

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పఠాన్‌ సినిమాను గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించకుండా అడ్డుకొని తీరుతామని బజరంగ్‌దళ్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ శివరాములు బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. హిందూ ధర్మానికి ప్రతీక అయిన కాషాయం రంగును పఠాన్‌ సినిమాలో అత్యంత అవమానకరంగా చిత్రీకరించి, హిందువుల మనోభావాలను గాయపరిచారని ఆరోపించారు. పఠాన్‌ సినిమా విడుదలైన రోజునే దేశవ్యాప్తంగా అడ్డుకున్నామని.. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో అడ్డుకున్నామని తెలిపారు. పోలీసులను రక్షణగా పెట్టి సినిమా థియేటర్లు నడిపించాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పఠాన్‌ సినిమా ఎక్కడా ప్రదర్శించకూడదని థియేటర్ల యజమానులకు శివరాములు సూచించారు.

సినిమా ప్రదర్శనపై నిరసన

మంగళ్‌హాట్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కాచిగూడ తారకరామ థియేటర్‌లో పఠాన్‌ సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బుధవారం రాత్రి బజరంగ్‌దళ్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. షారుక్‌ ఖాన్‌ పోస్టర్లను చించి వేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. సమాచారం అందుకున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు అక్కడకు చేరుకొని దాదాపు 20 మందిని అరెస్ట్‌ చేశారు. బజరంగ్‌దళ్‌ నాయకుడు దీపక్‌ మాట్లాడుతూ.. సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2023-01-26T00:33:05+05:30 IST