స్వచ్ఛందంగా సేవ చేస్తాం

ABN , First Publish Date - 2023-01-25T00:28:35+05:30 IST

అనుమతిస్తే పాఠాలు బోధిస్తాం సేవకు లక్షమంది ‘సీనియర్స్‌’ సిద్ధం సీఎ్‌సను కలిసిన టీఎ్‌ఫఎ్‌సఎ్‌సవో అధ్యక్షుడు పొదిల్ల కనకరత్నం బర్కత్‌పుర, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ ఆర్గనైజేషన్‌(టీఎ్‌ఫఎ్‌సఎస్‌వో) వ్యవస్థాపక అధ్యక్షుడు పొదిల్ల కనకరత్నం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తమ సేవలను వినియోగించుకోవచ్చునన్నారు. అందుకోసం సీనియర్‌ సిటిజన్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతాకుమారితో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో 40 లక్షల మంది సీనియర్‌ సిటిజన్లు ఉండగా, వారిలో లక్షమంది విశ్రాంతి ఉద్యోగులు ప్రభుత్వానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కనకరత్నం వివరించారు. ఎలాంటి వేతనాలు ఆశించకుండా స్వచ్ఛంద సేవలు అందించడానికి తాము సిద్ధమేనన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తే కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడతాయని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎ్‌సకు ఆయన వివరించారు. 2007 సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ను పటిష్ఠంగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రాల్లో సీనియర్‌ సిటిజన్స్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. సీఎ్‌సను కలిసిన వారిలో సంఘ నాయకురాలు ఎం.విజయలక్ష్మి ఉన్నారు.

స్వచ్ఛందంగా సేవ చేస్తాం
సీఎస్‌ శాంతాకుమారిని కలిసిన పొదిల్ల కనకరత్నం తదితరులు

అనుమతిస్తే పాఠాలు బోధిస్తాం

సేవకు లక్షమంది ‘సీనియర్స్‌’ సిద్ధం

సీఎ్‌సను కలిసిన టీఎ్‌ఫఎ్‌సఎ్‌సవో అధ్యక్షుడు పొదిల్ల కనకరత్నం

బర్కత్‌పుర, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ ఆర్గనైజేషన్‌(టీఎ్‌ఫఎ్‌సఎస్‌వో) వ్యవస్థాపక అధ్యక్షుడు పొదిల్ల కనకరత్నం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తమ సేవలను వినియోగించుకోవచ్చునన్నారు. అందుకోసం సీనియర్‌ సిటిజన్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతాకుమారితో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో 40 లక్షల మంది సీనియర్‌ సిటిజన్లు ఉండగా, వారిలో లక్షమంది విశ్రాంతి ఉద్యోగులు ప్రభుత్వానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కనకరత్నం వివరించారు. ఎలాంటి వేతనాలు ఆశించకుండా స్వచ్ఛంద సేవలు అందించడానికి తాము సిద్ధమేనన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తే కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడతాయని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎ్‌సకు ఆయన వివరించారు. 2007 సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ను పటిష్ఠంగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రాల్లో సీనియర్‌ సిటిజన్స్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. సీఎ్‌సను కలిసిన వారిలో సంఘ నాయకురాలు ఎం.విజయలక్ష్మి ఉన్నారు.

Updated Date - 2023-01-25T00:28:53+05:30 IST