Traffic diversions: అసెంబ్లీ పరిధిలో రేపు ట్రాఫిక్‌ మళ్లింపులు

ABN , First Publish Date - 2023-02-02T09:12:05+05:30 IST

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అసెంబ్లీ

Traffic diversions: అసెంబ్లీ పరిధిలో  రేపు ట్రాఫిక్‌ మళ్లింపులు

హైదరాబాద్‌ సిటీ: బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, రవీంద్రభారతి, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకాపూల్‌, ఎంజే మార్కెట్‌, నాంపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయన్నారు.

Updated Date - 2023-02-02T09:12:07+05:30 IST