Hyderabad City: నెలకు రూ.20వేల జీతం ఇస్తామని చెప్పి...

ABN , First Publish Date - 2023-02-02T11:27:44+05:30 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.56.71 లక్షలు కాజేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు

Hyderabad City: నెలకు రూ.20వేల జీతం ఇస్తామని చెప్పి...

హైదరాబాద్‌ సిటీ/జీడిమెట్ల: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.56.71 లక్షలు కాజేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జగద్గిరిగుట్ట పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చింతల్‌ గాంధీనగర్‌కు చెందిన సిద్దాని శ్రీకాంత్‌ (25) ఓఎల్‌ఎక్స్‌లో ఉద్యోగం కోసం వెతుకుతుండగా... గతేడాది జూన్‌ 15న వీ.సంధ్య, కే.హరీష్‌ పరిచయమయ్యారు. తాము కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నామని, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. రెస్యూమ్‌ పంపించాలని కోరగా... బాధితుడు సంధ్య వాట్సా్‌పకు తన వివరాలు పంపించాడు. టెలికాలర్‌గా ఎంపికయ్యావని, నెలకు రూ.20వేల జీతం ఇస్తామని చెప్పి శ్రీకాంత్‌ బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్‌ కార్డు తీసుకున్నారు.

అనంతరం వారు శ్రీకాంత్‌కు కొన్ని ఫోన్‌ నెంబర్లు ఇచ్చి, ఆ వ్యక్తులకు ఫోన్‌చేయాలని సూచించారు. ఉద్యోగంలో భాగమేనని భావించిన శ్రీకాంత్‌ వారికి కాల్స్‌ చేయగా... వారినీ సెలెక్ట్‌ చేస్తున్నట్లు చెప్పించి ఫోన్‌ చేసిన శ్రీకాంత్‌ ఖాతాల్లోకి డబ్బులు పంపించాలని సంధ్య, హరీష్‌ కోరారు. ఉద్యోగం వస్తోందనే ఆశతో పలువురు నిరుద్యోగులు వారు చెప్పిన ఖాతాల్లోకి (శ్రీకాంత్‌ ఖాతాతో పాటు యూపీఐ ఐడీల ద్వారా) డబ్బులు జమ చేశారు. ఇలా పలువురు బాధితులు మొత్తం రూ. 56.71 లక్షలు వారి ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. కాల్‌ లెటర్స్‌, ఆఫర్‌ లెటర్స్‌ నకిలీవని తెలయడంతో ఫోన్‌లో మాట్లాడిన శ్రీకాంత్‌ను బాధితులు నిలదీశారు. మోసపోయినట్లు గ్రహించిన శ్రీకాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2023-02-02T11:38:51+05:30 IST