Hyderabad: బాలిక వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-02-02T08:56:47+05:30 IST

బలవంతంగా బాలికకు వివాహం చేస్తుండగా హయత్‌నగర్‌ పోలీసులు అడ్డుకున్నారు. కౌన్సిలింగ్‌

Hyderabad: బాలిక వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్/హయత్‌నగర్‌: బలవంతంగా బాలికకు వివాహం చేస్తుండగా హయత్‌నగర్‌ పోలీసులు అడ్డుకున్నారు. కౌన్సిలింగ్‌ నిమిత్తం ఆమెను వనస్థలిపురంలోని సఖి సెంటర్‌కు తరలించారు. మంగళవారం రాత్రి 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు మైనర్‌ వివాహ విషయాన్ని రాచకొండ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ కు సమాచారం అందించారు. దాంతో కమిషనర్‌ డీఎస్‌. చౌహాన్‌ ఆదేశం మేరకు డీఐ నిరంజన్‌, ఎస్‌ఐ సూర్య, షీటీం సభ్యులు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సభ్యులు హయత్‌నగర్‌ బస్‌డిపొ రోడ్డు శ్రీనివాస కాలనీ లోని బాలిక ఇంటికి వెళ్లారు. వెంటనే అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చట్ట రీత్యా బాల్య వివాహం చేయడం నేరమని వారికి తెలిపారు. అనంతరం వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2023-02-02T08:56:50+05:30 IST