Per capita income TS : రాష్ట్ర తలసరి ఆదాయం 2.75 లక్షలు

ABN , First Publish Date - 2023-01-26T04:01:30+05:30 IST

అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతోంది. ఏటా వృద్ధిని నమోదు చేస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక, ఉత్పత్తి, వాణిజ్యం...

Per capita income TS : రాష్ట్ర తలసరి ఆదాయం 2.75 లక్షలు

తలసరి ఆదాయంలో దేశంలో మూడోస్థానం..

రంగారెడ్డిలో అత్యధికం, వరంగల్‌ రూరల్‌లో అత్యల్పం

2021-22లో 19.4@ వృద్ధి.. రూ.11,48,115 కోట్ల జీఎ్‌సడీపీ

జీడీపీకి రాష్ట్ర వాటా 4.9ు.. దేశంలోనే ఏడో స్థానం

రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు 59.15 లక్షల మంది

పౌష్ఠికాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులు 6.09ు

‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహం’లో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతోంది. ఏటా వృద్ధిని నమోదు చేస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక, ఉత్పత్తి, వాణిజ్యం, రవాణా, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ)కి ఊతమిస్తున్నాయి. ఫలితంగా 2021-22లో రాష్ట్రం ఏకంగా 19.4ు వృద్ధిని నమోదు చేసింది. దేశాభివృద్ధికి.. దేశ జీడీపీలో 4.9ు మేర వాటాను అందిస్తోంది. జీఎ్‌సడీపీ వృద్ధిపరంగా దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏడో స్థానంలో నిలిచింది. ఈమేరకు రాష్ట్ర అర్థ గణాంక సంచాలకుల కార్యాలయం బుధవారం ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహం(తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌)-2022’ నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఈ నివేదికను ఆవిష్కరించారు. రాష్ట్ర జనాభా, భౌగోళిక, మౌలిక సదుపాయాలు, ఆర్థిక స్థితిగతులు, పాఠశాల విద్య, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, పశు సంవర్థకం, సాగునీటి పారుదల, రైతుబంధు, రైతుబీమా, పరిశ్రమలు, ఆరోగ్యం, గ్రామీణ తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి, సామాజిక భద్రత వంటి 16 అంశాలకు సంబంధించిన వివరాలను ఈ నివేదికలో వెల్లడించారు.

స్థూల దేశీయోత్పత్తి రూ. 11.48 లక్షల కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల(కరెంట్‌ ప్రైసెస్‌) వద్ద రూ.11,48,115 కోట్లుగా నమోదైంది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం కంటే 19.4ు అధికం. 2020-21లో జీఎ్‌సడీపీ రూ.9,61,800 కోట్లుగా ఉంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2021-22లో ప్రస్తుత ధరల వద్ద రూ.2,36,64,637 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. అంటే.. జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటా 4.9@ ఉందని వివరించింది. రాష్ట్ర ప్రాథమిక రంగం(ప్రైమరీ సెక్టార్‌)లోని వ్యవసాయం, అడవులు, మత్స్య సంపద, మైనింగ్‌, ద్వితీయ రంగం(సెకండరీ సెక్టార్‌)లోని ఉత్పత్తి, నిర్మాణాలు, విద్యుత్తు, తృతీయ రంగం(టెర్షియరీ సెక్టార్‌)లోని వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధిని సాధించడంతో జీఎ్‌సడీపీ పెరుగుదలకు దోహదపడ్డాయి. 2021-22లో ప్రైమరీ సెక్టార్‌ 8.60@, సెకండరీ సెక్టార్‌ 20.07@, టెర్షియరీ సెక్టార్‌ 20.05@ మేర వృద్ధిని నమోదు చేశాయి. ప్రధానంగా రాష్ట్రం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రూ.1,94,656 కోట్లు, తయారీ రంగంలో రూ.1,22,115 కోట్లు, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్ల రంగంలో రూ.1,75,400, రవాణా రంగంలో రూ.54,081 కోట్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రూ.2,18,705 కోట్లు, ఇతర సేవల్లో రూ.1,01,241 కోట్ల మేర ఉత్పత్తిని సాధించింది. జీఎ్‌సడీపీ పరంగా.. రూ.20,65,463 కోట్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రూ.12,01,736 కోట్లతో నాలుగో స్థానంలో, తెలంగాణ ఏడోస్థానంలో ఉంది. 2016-17 నుంచి 2020-21 వరకు ఐదేళ్ల సగటు వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుంటే.. తెలంగాణ 10.84ు వృద్ధితో ఆరో స్థానంలో, 10.97ు వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉన్నాయి. 12.65ు సగటు వృద్ధి రేటుతో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

రంగారెడ్డి టాప్‌, ములుగు లాస్ట్‌

రాష్ట్రంలోనే గ్రాస్‌ డిస్ట్రిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌(జీడీడీపీ)లో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉంది. ములుగు జిల్లా మాత్రం చాలా తక్కువ ఉత్పత్తిని సాధించింది. 2020-21 సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద రంగారెడ్డి జిల్లా రూ.1,98,997 కోట్ల ఉత్పత్తి సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. హైదరాబాద్‌(రూ.1,62,565 కోట్లు), మేడ్చల్‌-మల్కాజిగిరి(రూ.62,506 కోట్లు), సంగారెడ్డి(రూ.45,677 కోట్లు), నల్లగొండ(రూ.38,927 కోట్లు) ఉన్నాయి. ములుగు జిల్లా అత్యల్పంగా రూ.5,626 కోట్ల ఉత్పత్తిని సాధించింది.

తలసరి ఆదాయంలో గణనీయ ప్రగతి

తలసరి ఆదాయంలో రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది. 2021-22 సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,75,443గా నమోదు చేసుకుని, మూడో స్థానంలో నిలిచింది. 2020-21లో రూ.2,31,103 కంటే ఇది 19.2@ ఎక్కువ. దేశ తలసరి ఆదాయం రూ.1,50,007(18.3%) కంటే.. రాష్ట్ర పురోగతి 0.9ు ఎక్కువ. రాష్ట్రంలోని జిల్లాల విషయానికొస్తే.. అత్యధిక తలసరి ఆదాయం రూ.6,69,102తో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ తలసరి ఆదాయం రూ.3,49,061 కాగా, వరంగల్‌ అర్బన్‌(హనుమకొండ) జిల్లా 1,30,821లతో చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో వ్యవసాయ కార్మికులు 59.15 లక్షల మంది ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఖమ్మంలో 4.14 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉండగా, నల్లగొండ జిల్లా 3.89 లక్షల మందితో రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో హైదరాబాద్‌లో(23,029 మంది), మేడ్చల్‌-మల్కాజిగిరి(44,980 మంది) అట్టడుగున ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న వారు 31.51 లక్షల మంది ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కేటగిరీలో 1.86 కోట్ల మంది ఉన్నారు. ఈ విభాగంలో 25.30 లక్షల మందితో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్‌-మల్కాజిగిరి(14.95 లక్షల మంది), రంగారెడ్డిలో(14.03 లక్షల మంది), నల్లగొండ(8.12 లక్షల మంది) జిల్లాలున్నాయి. వేర్వేరు రంగాల్లో 1.63 కోట్ల మంది కార్మికులున్నారు. ఈ కేటగిరీలో 14.13 లక్షల మందితో హైదరాబాద్‌, 10.22 లక్షల మందితో రంగారెడ్డి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

6ు మంది పిల్లల్లో పౌష్ఠికాహారంలోపం

తెలంగాణ వ్యాప్తంగా 19.79 లక్షల మంది పిల్లలున్నారు. వారిలో 18.58 లక్షల మంది నార్మల్‌ చిల్డ్రన్‌ కాగా, 1.20 లక్షల మంది(6.09ు) పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. వీరిలో 1.83ు మంది తీవ్ర పోషకాహారలోపంతో, 4.26ు మంది మోస్తరు లోపంతో బాధపడుతున్నారు. 13 జిల్లాల్లో తీవ్రపోషకాహార లోపం ఉన్నట్లు తేలింది. పౌష్ఠికాహార లోపం అధికంగా ఉన్న పిల్లలు ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా 1,33,108 మందితో మొదటి స్థానంలో ఉంది. మేడ్చల్‌-మల్కాజిగిరి(1.19 లక్షల మంది), నిజామాబాద్‌(1.11 లక్షల మంది) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

11.50 లక్షల మందికి కల్యాణ లక్ష్మి

రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ కింద 11.50 లక్షల మంది లబ్ధిపొందారు. ఇందు కోసం సర్కారు రూ.9917 కోట్లు వెచ్చించింది. లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలున్నారు.

Updated Date - 2023-01-26T06:29:32+05:30 IST