తెలంగాణ జీఎస్‌డీపీ రూ.14.16 లక్షల కోట్లు!

ABN , First Publish Date - 2023-02-07T04:27:33+05:30 IST

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) భారీగా ఉంటుందని తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది.

తెలంగాణ జీఎస్‌డీపీ రూ.14.16 లక్షల కోట్లు!

2023-24లో 16% పెరుగుతుందని అంచనా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) భారీగా ఉంటుందని తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.14.16 లక్షల కోట్ల మేర నమోదవుతుందని భావిస్తోంది. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతం జీఎస్‌డీపీ వార్షిక వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.12,20,804 కోట్ల జీఎస్‌డీపీ ఉంటుందని అంచనా వేసింది. సవరించిన అంచనాల ప్రకారం.. మార్చి నాటికి రూ.13,27,495 కోట్లుగా నమోదవుతుందని భావిస్తోంది. కానీ, పాత బడ్జెట్‌లో అంచనా వేసిన దానికి 2023-24లో 16 శాతం వృద్ధి నమోదవుతుందని చెబుతోంది. అంటే 2023-24లో మొత్తం రూ.14.16 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది.

Updated Date - 2023-02-07T04:27:35+05:30 IST