Road Accident: అదుపు తప్పి బోల్తాపడిన సూపర్ లగ్జరీ బస్సు..

ABN , First Publish Date - 2023-02-06T09:04:21+05:30 IST

జిల్లా కేంద్రంలోని పెద్ద వాగు సమీపంలో సూపర్ లగ్జరి ఆర్టీసీ బస్సు అదుపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో

Road Accident: అదుపు తప్పి బోల్తాపడిన సూపర్ లగ్జరీ బస్సు..

కొమురం భీం: జిల్లా కేంద్రంలోని పెద్ద వాగు సమీపంలో సూపర్ లగ్జరి ఆర్టీసీ బస్సు అదుపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్‎కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ముగ్గురే ప్రయాణికులు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T09:04:28+05:30 IST