IT Raids: హైదరాబాద్‌లో రెండో రోజు ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2023-02-01T09:49:37+05:30 IST

భాగ్యనగరంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసం సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి.

IT Raids: హైదరాబాద్‌లో రెండో రోజు ఐటీ సోదాలు

హైదరాబాద్: భాగ్యనగరంలో ఐటీ సోదాలు (IT Raids In Hyderabad) రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి (MLC VenkatramiReddy) నివాసం సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాజ్‌పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ తనిఖీలు చేపట్టింది. రాజ్‌పుష్ప, ముప్పా కన్‌స్ట్రక్షన్స్, వెరిటెక్స్ సంస్థలు సహా పలు సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. 40 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులు, మేనేజింగ్ డైరెక్టర్లు, పీఏల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు.

ముప్పాలో తనిఖీలు...

ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Muppa Projects India Pvt) కార్యాలయంలోనూ రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముప్పా మెలోడీస్ పేరుతో తెల్లాపూర్‌లో ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ముప్పా పూర్తి చేసింది. ఈ క్రమంలో ఐదేళ్ల ఐటీ రిటర్న్స్‌తో పాటు జీఎస్టీ చెల్లింపులపై ఐటీ ఆరా తీస్తోంది. సీఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు జరుగుతున్నాయి.

ముగిసిన సోదాలు...

మరోవైపు నగరంలోని వసుధ ఫార్మా (Vasudha Farma)లో ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి ఈరోజు వరకు అధికారులు వసుధ ఫార్మాలో సోదాలు నిర్వహించారు. వసుధ గ్రూప్స్​ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. 50కి పైగా ఐటీ అధికారుల బృందాలు ఎస్‌ఆర్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయానికి సోదాలు ముగియగా... ఐదేళ్ల ఐటీ రిటర్న్స్‌పై విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2023-02-01T10:12:39+05:30 IST