ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనదే

ABN , First Publish Date - 2023-01-26T03:57:51+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద మహోన్నత రాజ్యాంగం మనదేనని, దీన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనదే

సీఎం కేసీఆర్‌ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతిపెద్ద మహోన్నత రాజ్యాంగం మనదేనని, దీన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నేడు (గురువారం) 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన రిపబ్లిక్‌డే భారత పౌరులందరికీ పండుగ రోజని, సమానత్వంతో కూడిన సమర్థవంత ప్రజాస్వామిక పాలనతోనే దేశరాజ్యాంగం ఆశించిన లక్ష్యం సిద్థిస్తుందని చెప్పారు. విభిన్న సామాజిక సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటమే భారతదేశ ప్రధాన లక్షణమన్నారు. రాష్ర్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్‌ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడే సంక్షేమం పరిఢవిల్లి, దేశం మరింతగా ప్రగతిపథంలో పయనిస్తుందని కేసీఆర్‌ వెల్లడించారు. భారత్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన సమయంలో మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ సమర్పించిన సీఎం

అజ్మీర్‌ దర్గా ఉర్సు సందర్భంగా ఏటా ప్రభుత్వం తరపున ఇచ్చే చాదర్‌ను సీఎం కేసీఆర్‌ ఈయేడూ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ బాగుండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం కేసీఆర్‌ చాదర్‌ను వక్ఫ్‌ బోర్డు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ, ఆర్థికమంత్రి తన్నీరు హరీ్‌షరావు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-01-26T03:57:52+05:30 IST