Operation Smile: 1,279 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2023-02-02T09:39:38+05:30 IST

ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా జనవరిలో నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీలలో పోలీసులు, చైల్డ్‌,

Operation Smile: 1,279 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా జనవరిలో నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీలలో పోలీసులు, చైల్డ్‌, మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి మొత్తం 1,279 మంది చిన్నారులను కాపాడారు. ప్రతి ఏడాది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక స్మైల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి 450 మందిని కాపాడారు. ఇందులో 415 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనాథలుగా ఉన్న 16 మంది బాలికలు, 19 మంది బాలురను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు సంరక్షణా కేంద్రాల్లో చేర్పించారు. సైబరాబాద్‌లో 9 బృందాలతో నిర్వహించిన డ్రైవ్‌లో 829 చిన్నారులను రక్షించిన ట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, జాయింట్‌ సీపీ గజరావ్‌భూపాల్‌ తెలిపారు. 487మంది బాలురు, 87మంది రాష్ట్రానికి చెందిన బాలికలు కాగా, 245 మంది బాలురు, 10మంది బాలికలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని, బాలలను కార్మికులుగా నియమించుకున్న 149 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

Updated Date - 2023-02-02T09:39:40+05:30 IST