అనాథల సంక్షేమానికి చట్టం ఏదీ: మందకృష్ణ

ABN , First Publish Date - 2023-02-07T03:40:41+05:30 IST

అనాథల సంక్షేమానికి చేస్తామన్న చట్టం ఏమైందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

అనాథల సంక్షేమానికి చట్టం ఏదీ: మందకృష్ణ

గజ్వేల్‌, ఫిబ్రవరి 6: అనాథల సంక్షేమానికి చేస్తామన్న చట్టం ఏమైందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడుతూ అనాథలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. గత ఏడాది అనాథల సంక్షేమంపై రాష్ట్రప్రభుత్వం వేసిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన తీర్మానాలను ఏడాది అవుతున్నా ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఈ నెల 15న గజ్వేల్‌లో మహాదీక్షను చేపడుతున్నట్లు మందకృష్ణ ప్రకటించారు.

Updated Date - 2023-02-07T03:40:42+05:30 IST