‘బస్తీ’లో కార్పొరేట్‌ వైద్యం

ABN , First Publish Date - 2023-01-26T00:35:08+05:30 IST

ఒకప్పుడు పేద ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా గాంధీ, ఉస్మానియా వంటి పెద్దపెద్ద ఆస్పత్రులకు పరుగులు తీసేవారు.

‘బస్తీ’లో కార్పొరేట్‌ వైద్యం

టెలీమెడిసిన్‌ ద్వారా పేదలకు మెరుగైన సేవలు

ఆదివారం సైతం అందుబాటులో వైద్యులు

మందులు, వైద్య పరీక్షలు ఉచితం

పద్మారావునగర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పేద ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా గాంధీ, ఉస్మానియా వంటి పెద్దపెద్ద ఆస్పత్రులకు పరుగులు తీసేవారు. అయితే అక్కడ ఏ సమస్యకు ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమక పడేవారు. అలాంటి సమస్యలకు చెక్‌ పెడుతూ బస్తీలోనే దవాఖానాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇక్కడ సైతం పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తున్నారు. ఈ వైద్య సేవల కారణంగా బస్తీలోని పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖానాలో టెలీమెడిసిన్‌ ద్వారా వివిధ రకాల వైద్య సేవలు సైతం పేదలకు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వేలు, లక్షల్లో ఖర్చయ్యే సమస్యలను సైతం ఈ పద్ధతిలో బస్తీ దవాఖానాలోనే నయం చేస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండానే వివిధ రకాల వైద్య పరీక్షలతో పాటు మందులు సైతం లభిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

క్రమం తప్పకుండా పరీక్షలు

మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలకు సైతం క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నారు. ప్రజలకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బస్తీ దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు. నగరవ్యాప్తంగా ఇప్పటికే 152 బస్తీ దవాఖానాలు పేద ప్రజల అందుబాటులో ఉన్నాయి. సనత్‌నగర్‌ నియోజకవర్గం బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ పరిధిలో చాచా నెహ్రూ నగర్‌, బోయగూడ, హమాల్‌ బస్తీలోని బస్తీ దవాఖానాలో మెరుగైన, కార్పొరేట్‌ తరహా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

అందుబాటులో ఆరోగ్య పరీక్షలు

సీసీనగర్‌ బస్తీ దవాఖానాలో వేల రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలు సైతంం ఉచితంగా చేస్తున్నారు. వివిధ రక్త పరీక్షలు సీబీపీ, డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా, కిడ్నీ, లివర్‌, ఆర్థరైటీస్‌, ఆర్‌ఏ ఫ్యాక్టర్‌, ఈఎ్‌సఆర్‌, సీఆర్‌పీ, హెచ్‌బీ, ఏఐసీ, ఎఫ్‌బీఎస్‌/ పీఎల్‌బీఎస్‌, కలర్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ వంటి అనేక రకాల పరీక్షలను చేస్తున్నారు. ల్యాబ్‌ టెస్టుల కోసం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శాంపిల్స్‌ను సేకరిస్తారు. 24 గంటల వ్యవధిలో టెస్ట్‌ రిపోర్ట్స్‌ను సంబంధిత రోగుల ఫోన్‌లకు పంపిస్తారు. అవసరమైనవారికి టెస్ట్‌ రిపోర్ట్స్‌ ప్రింట్‌లను అందజేస్తారు. ఇతర అవసరమైన మూత్ర, అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌, ఈసీజీ, ఎక్స్‌రే, సీటీ స్కానింగ్‌ కోసం రోగులను తెలంగాణ డయోగ్నస్టిక్‌ కేంద్రాలకు గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తారు.

టెలీమెడిసిన్‌ సేవలు

రోగులకు మెరుగైన వైద్యం కోసం బస్తీ దవాఖానాలో టెలీమెడిసిన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా వివిధ విభాగాల వైద్యులతో రోగులను ఆన్‌లైన్‌లో మాట్లాడిస్తూ వైద్యం అందజేస్తున్నారు. ఈ విధానంం మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టెలీమెడిసిన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ ఉస్మానియా, నిమ్స్‌, ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రి (కోఠి) ఎయిమ్స్‌ (బీబీనగర్‌) ఆసుపత్రులకు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణులు హైదరాబాద్‌ టెలీమెడిసిన్‌ గ్రూప్‌ ద్వారా అందుబాటులో ఉండి ఆన్‌లైన్‌ ద్వారా బస్తీ దవాఖానా వైద్యుడి సహకారంతో రోగికి వైద్య సేవలు అందిస్తారు. వైద్య నిపుణుల సలహా మేరకు బస్తీ దవాఖానాలోని రోగులకు చికిత్స అందిస్తున్నారు. టెలీమెడిసిన్‌ ద్వారా జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, ఆప్తామాలజీ, పీడియాట్రిక్స్‌, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, ఫిజియోథెరఫీ, మెడికల్‌ అంకాలజీ, ఎండోక్రానాలజీ వంటి అనేక విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు. చాచా నెహ్రూ నగర్‌ బస్తీ దవాఖానాకు ప్రతీ రోజు 90 నుంచి 110 మంది వరకు రోగులు వస్తున్నారు. టెలీమెడిసిన్‌ ద్వారా దాదాపుగా ఐదుగురు సేవలు పొందుతారు. వీటన్నింటితో పాటు గర్భిణులు, బాలింతలు, శిశువులు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, టీకాలు అందిస్తున్నారు. గర్భిణులకు అవసరమైన సలహాలు, సూచనల అందించి ఏఎన్‌ఎం పర్యవేక్షణలో ఆరోగ్య కార్యకర్తలు సాయం అందిస్తారు.

ఆదివారమూ అందుబాటులో..

- డాక్టర్‌ రాజేష్‌, చాచానెహ్రూనగర్‌ బస్తీ దవాఖానా

బస్తీదవాఖానా ద్వారా ప్రజలందరికీ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. సాధారణ వైద్య సేవలతో పాటు టెలీమెడిసిన్‌ సేవలు మా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచన మేరకు ప్రజల సౌకర్యార్దం ఆదివారం కూడా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. రోజుకు వందకు పైగా రోగులు కేంద్రాన్ని సందర్శిస్తారు.

Updated Date - 2023-01-26T00:37:01+05:30 IST