Business చేయాలంటే లైసెన్స్ ఉండాల్సిందే..

ABN , First Publish Date - 2023-01-25T09:05:50+05:30 IST

పలు రకాల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలనే నిబంధనను పోలీసులు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు.

Business చేయాలంటే లైసెన్స్ ఉండాల్సిందే..

హైదరాబాద్ : పలు రకాల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలనే నిబంధనను పోలీసులు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. గతంలో వ్యాపారులు లైసెన్స్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. అయితే దానిని 2014లో రద్దు చేయడం జరిగింది. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత దీనిని అమల్లోకి తీసుకువస్తున్నారు. వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌(NOC)ని కలిగి ఉండాలి.

ఎవరు తీసుకోవాలి?

ఇక ఈ లైసెన్స్‌ను ఎవరెవరు తీసుకోవాలనే దానిపై పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్, పట్లు, కాఫీ షాప్, టీ స్టాల్, కెఫే, బేకరీ రెస్టారెంట్, ఐస్ క్రీమ్, పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్స్, ఎక్స్‌ఫ్లోజివ్, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు విక్రయించేవారు ఈ లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలి.

తీసుకోవడం ఎలా?

లైసెన్స్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్‌ను పొందాలనుకునే వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. తమ వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకూ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే.. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సు, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఏటా ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకూ గడువుతో లైసెన్సులు జారీ చేయడం జరుగుతుంది.

Updated Date - 2023-01-25T09:26:15+05:30 IST