Kaushik Reddy: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-25T16:40:08+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Kaushik Reddy: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కరీంనగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్‌ సమాధానం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వివేక్ (MP Vivek) దగ్గర రూ.వంద కోట్ల వరకు తీసుకుని హుజురాబాద్‌లో ఖర్చు పెట్టామని ఈటల చెప్పారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బులు ఏమయ్యాయని ఐటీ, ఈసీకి ఫిర్యాదు చేస్తామని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-01-25T18:29:20+05:30 IST