అత్యాచారయత్న కేసులో నిందితుడికి జైలు, జరిమానా

ABN , First Publish Date - 2023-01-25T00:14:02+05:30 IST

రంగారెడ్డి జిల్లాకోర్టులు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తిరుపతి తీర్పిచ్చారు.

అత్యాచారయత్న కేసులో నిందితుడికి జైలు, జరిమానా

రంగారెడ్డి జిల్లాకోర్టులు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తిరుపతి తీర్పిచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన ఓ మహిళ 2014 ఏప్రిల్‌ 7న పెద్దఅమ్మాయిని తీసుకుని సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన బంగారం దుకాణంలో పనిచేసే 24 సంవత్సరాల వ్యక్తి ఇంట్లో అన్నతోపాటు ఉన్న బాలికను బంగారు దుకాణం చూపిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. దుకాణంలోకి వెళ్లాక బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని బాలిక తల్లికి చెప్పగా ఆమె చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి మూడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ.5000 జరిమానా విధించారు.

Updated Date - 2023-01-25T00:14:04+05:30 IST