చాక్నావాడి నాలా పనుల పరిశీలన

ABN , First Publish Date - 2023-01-26T00:37:23+05:30 IST

గోషామహల్‌, బేగంబజార్‌లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

చాక్నావాడి నాలా పనుల పరిశీలన

అఫ్జల్‌గంజ్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): గోషామహల్‌, బేగంబజార్‌లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఇటీవల కుంగిపోయిన చాక్నావాడి నాలా నిర్మాణ పనులను బీఆర్‌ఎస్‌ నాయకులు నంద కిశోర్‌ వ్యాస్‌ బిలాల్‌, ఆల పురుషోత్తం రావు, గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, ఉద్యమ నాయకులు ఆర్‌.వి.మహేందర్‌ కుమార్‌, ఎం.ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌లు ఎం.రాంచందర్‌ రాజు, పరమేశ్వరి సింగ్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వందల ఏళ్ల క్రితం వేసిన నాలాలను రూ.1.27 కోట్ల నిధులను వెచ్చించి నూతన నాలా పనులను చేపడుతున్నామన్నారు. దారుస్సలాం, బేగంబజార్‌, ఉస్మాన్‌గంజ్‌, కిషన్‌బాగ్‌, గురుద్వారా మీద 2.5 కిలో మీటర్ల నాలా పనులను చేపట్టామన్నారు. స్ర్టాటజిక్‌ నాలాల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని నాలాల నిర్మాణాలకు రూ.6,700 కోట్లను వెచ్చించామన్నారు. కార్యక్రమంలో జాంబాగ్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు వెంకటేశ్‌ గౌడ్‌, క్రాంతి కుమార్‌, గోషామహల్‌ డివిజన్‌ నాయకులు సురేశ్‌ ముదిరాజ్‌, ఎస్‌.ధన్‌రాజ్‌, యోగేశ్‌ యాదవ్‌, పప్పు సింగ్‌, కోటి శైలేష్‌ కురుమ, ప్రదీప్‌, మహిళా నాయకురాలు శాంతిదేవి, సంతోష్‌ గుప్తా, ప్రియా గుప్తాలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:37:23+05:30 IST