Hyderabad City: నగరంలో పెరిగిన చలి

ABN , First Publish Date - 2023-01-27T10:50:09+05:30 IST

నగరంలో మళ్లీ చలి పెరిగింది. రాత్రిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుండడంతో నగరవాసులు గజగజ

Hyderabad City: నగరంలో పెరిగిన చలి

హైదరాబాద్‌ సిటీ: నగరంలో మళ్లీ చలి పెరిగింది. రాత్రిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుండడంతో నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. రాత్రి 9 నుంచి మొదలవుతున్న చలితీవ్రత మరుసటి రోజు ఉదయం 8గంటల వరకు కొనసాగుతుండడంతో పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరాన్‌, ఇరాక్‌ దేశాల నుంచి వచ్చే వేడిగాలులు తగ్గడంతో.. తెలంగాణతోపాటు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు రోజులపాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. గురువారం నగరంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.3 డిగ్రీలుండగా, పలు ప్రాంతాల్లో తక్కువగా రికార్డయ్యాయి. ఎల్‌బీనగర్‌లో అత్యల్పంగా 14.7 డిగ్రీలు, అల్వాల్‌లో 15.4, పటాన్‌చెరులో 15.5, కూకట్‌పల్లిలో 15.9 డిగ్రీలు నమోదయ్యాయి.

Updated Date - 2023-01-27T10:50:11+05:30 IST