IAA: మీడియాలో జెండర్‌ సెన్సిటైజేషన్‌‌పై ఫిబ్రవరిలో సదస్సు

ABN , First Publish Date - 2023-01-25T21:35:32+05:30 IST

మీడియాలో జెండర్‌ సెన్సిటైజేషన్‌పై అవగాహన కల్పిస్తూ వాయిస్‌ ఆఫ్‌ ఛేంజ్‌ సదస్సును..

IAA: మీడియాలో జెండర్‌ సెన్సిటైజేషన్‌‌పై ఫిబ్రవరిలో సదస్సు

హైదరాబాద్‌: మీడియాలో జెండర్‌ సెన్సిటైజేషన్‌పై అవగాహన కల్పిస్తూ వాయిస్‌ ఆఫ్‌ ఛేంజ్‌ సదస్సును హైదరాబాద్‌ టీ-హబ్‌ వద్ద ఫిబ్రవరి 3న ఇంటర్నేషనల్‌ అడ్వర్టయిజింగ్‌ అసోసియేషన్‌ (ఐఏఏ), ఇండియా చాఫ్టర్‌ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ (Tamilisai Soundarajan) హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమ నేపథ్యంగా 30 సెకన్ల టీవీసీ నుంచి మూడు గంటల చిత్రం వరకూ సృజనాత్మక రంగంలో లింగ చిత్రణ తీసుకున్నారు. పరిశ్రమకు చెందిన సుప్రసిద్ధ వ్యక్తులు పక్షపాతాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకత, లింగ వర్ణన దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమలో కనిపించే ధోరణులను గురించి మాట్లాడతారు. ఈ సదస్సుకు సాక్షి మీడియా గ్రూప్‌ ముఖ్య భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, ఈ కార్యక్రమానికి నాలెడ్జ్‌భాగస్వామిగా యునిసెఫ్‌ వ్యవహరించనుంది.

సెప్టెంబర్‌లో యునిసెఫ్‌తో కలిసి విడుదల చేసిన జీనా డేవిస్‌ అధ్యయనంతో ప్రకటనలు మరియు కమ్యూనికేషన్‌ రంగంలో లింగం యొక్క వకీృకత చిత్రణ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో, ఐఏఏ- ఇండియా సమర్ధవంతమైన మార్పు దిశగా మొదటి అడుగు వేసింది. ఈ అధ్యయనంలో పేర్కొనబడిన వాస్తవాలను విస్తృతమైన లింగ మూస మరియు పక్షపాతం యొక్క ధోరణులతో కూడిన 1000కు పైగా యాడ్‌లను పరిశీలించిన తర్వాత వెల్లడించారు.

స్త్రీలు మరియు ఇతర లింగాలను ఎలా చూస్తున్నారు, హీనంగా వారిని చూపడం, పంజరంలో పక్షిలా వారిని చూస్తున్న విధానం గురించి వాస్తవాలను వెల్లడించారు. ఈ తరహా సంచలనాత్మక అధ్యయనాలు జరుగుతున్న నేపథ్యంలో ఐఏఏ ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా విజ్ఞానాన్ని మరియు మరిన్నింటిని ఒకే దరికి తీసుకురావడంతో పాటుగా ఈ సదస్సు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. తమ ప్రయత్నాలను సరైన వ్యక్తులకు చేరేలా చేయడంతో పాటుగా సృజనశీలురకు మరియు పరిశ్రమ శక్తులకు ఈ అంశాల పట్ల మరింత అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

Updated Date - 2023-01-25T21:35:41+05:30 IST