Hyderabad బ్యాండ్‌ మోతకు లైసెన్స్‌ మస్ట్‌

ABN , First Publish Date - 2023-01-25T10:43:45+05:30 IST

పబ్‌ల అనుమతులపై పోలీసులు దృష్టి సారించారు. ఎక్సైజ్‌, ట్రేడ్‌, ఫైర్‌, మద్యం సరఫరా లైస్సెన్సు

Hyderabad బ్యాండ్‌ మోతకు లైసెన్స్‌ మస్ట్‌

హైదరాబాద్/బంజారాహిల్స్‌: పబ్‌ల అనుమతులపై పోలీసులు దృష్టి సారించారు. ఎక్సైజ్‌, ట్రేడ్‌, ఫైర్‌, మద్యం సరఫరా లైస్సెన్సు విధి విధానాలను పరిశీలించే పనిలో పడ్డారు. రాత్రి కాగానే పబ్‌లు బ్యాండ్‌ మ్యూజిక్‌, సంగీత విభావరులు పెట్టి పార్టీ ప్రియులను ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో సంగీతం పెట్టాలంటే అమ్యూజ్‌మెంట్‌ లైస్సెన్స్‌ ఉండాలని పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో సుమారు 50 పబ్‌ యజమానులు లైస్సెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రోడ్లపై పార్కింగ్‌ చేస్తున్న హోటళ్లు, పబ్‌లపై కూడా పోలీసులు దృష్టి సారించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10లోని బాబీలాన్‌ బార్‌ అండ్‌ కిచెన్‌ రెస్టారెంట్‌పై రెండు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-01-25T10:43:45+05:30 IST