ఇక ఈ-పాస్‌పోర్టులు వేగవంతం

ABN , First Publish Date - 2023-02-02T02:49:33+05:30 IST

చిప్‌ అమర్చి ఉండే ఈ-పా్‌సపోర్టుల జారీకి కేంద్రం శరవేగంగా అడుగులు ముందుకేస్తోంది. దీనికి తాజా బడ్జెట్‌లో రూ.1002.78 కోట్లు కేటాయించింది.

ఇక ఈ-పాస్‌పోర్టులు వేగవంతం

రూ.1002 కోట్ల భారీ కేటాయింపు

జీ 20 సమావేశాలకు రూ.990 కోట్లు

గల్ఫ్‌లో నిర్భయ సెంటర్లకు నిర్ణయం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) : చిప్‌ అమర్చి ఉండే ఈ-పా్‌సపోర్టుల జారీకి కేంద్రం శరవేగంగా అడుగులు ముందుకేస్తోంది. దీనికి తాజా బడ్జెట్‌లో రూ.1002.78 కోట్లు కేటాయించింది. అలాగే విదేశాల నుంచి ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల నుంచి యాజమానుల ద్వారా ఉద్యోగ హామీ, ఒప్పంద పత్రాల ప్రక్రియను పూర్తిగా ఎలకా్ట్రనిక్‌ విధానంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి అవసరమైన ఆధునిక పరిజ్ఞానం కోసం కూడా ఈ నిధులు ఖర్చు చేస్తారు. జీ-20 అధ్యక్ష స్థానంలో ఉండి విశ్వగురువుగా వెలగాలని చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రూ.990 కోట్లు కేటాయించింది. జీ 20కి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరులోపు 200 సమావేశాలు నిర్వహించనుంది. ఇక తాజా బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.18,050 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.800 కోట్లు ఎక్కువ. అలాగే విదేశాలకు సహాయం చేయడానికి రూ.5408 కోట్లు కేటాయించారు. భారత వాగ్దానాలు, పలుకుబడితో చూస్తే ఈ కేటాయింపు అంతంతమాత్రమే. ఇక ప్రవాసీయుల సంక్షేమానికి వస్తే వన్‌ సర్వీస్‌ సెంటర్లు నెలకొల్పడానికి రూ.7 కోట్లు కేటాయించారు. ఒక్క దుబాయి మినహా అన్ని గల్ఫ్‌ దేశాల్లో, కెనడా, సింగపూర్‌లో కష్టాల్లో ఉన్న భారతీయుల మహిళలకు సహాయం అందించడానికి ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పలుకుబడిని పెంచడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయింపులను రెండింతలు పెంచాలని పార్లమెంటరీ స్ధాయి సంఘం, ఇతర వర్గాలు కోరినా కేంద్రం పెడచెవిన పెట్టింది.

Updated Date - 2023-02-02T02:49:35+05:30 IST