అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

ABN , First Publish Date - 2023-01-26T00:43:59+05:30 IST

అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
సీసీరోడ్లకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాసరావు

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

హైదర్‌నగర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం హైదర్‌నగర్‌ డివిజన్‌ రాంనరే్‌షనగర్‌, సమతనగర్‌, ఆదిత్యనగర్‌, హెచ్‌ఎంటీహిల్స్‌ కాలనీలో రూ.1.48కోట్ల వ్యయంతో సీసీరోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు త్వరగా ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ కోసం రోడ్ల నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. మెరుగైన ప్రజా జీవనానికి అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు,

Updated Date - 2023-01-26T00:43:59+05:30 IST