Flat అద్దెకు కావాలని.. రూ.10 వేలు కాజేసిన సైబర్‌నేరగాళ్లు

ABN , First Publish Date - 2023-02-06T07:38:09+05:30 IST

ఫ్లాట్‌ అద్దెకు కావాలని మహిళకు ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.10 వేలు

Flat అద్దెకు కావాలని.. రూ.10 వేలు కాజేసిన సైబర్‌నేరగాళ్లు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ఫ్లాట్‌ అద్దెకు కావాలని మహిళకు ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.10 వేలు కాజేశారు. నగరానికి చెందిన ఈ నాన్సి అమిలీయా తన ఫ్లాట్‌ను ఇంకొకరికి పంచుకునేందుకు 99ఎకర్స్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. గత నెల 30న రణ్‌దీ్‌పసింగ్‌ అనే వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. తాను సీఐఎ్‌సఎఫ్‌ జవాన్‌ అని నకిలీ ఐడీ కార్డు పంపించాడు. గర్భవతి అయిన తన భార్య, కమార్తెకు ఫ్లాట్‌ కావాలని చెప్పాడు. అడ్వాన్స్‌ పంపిస్తానని పేటీఎం లింక్‌ను పంపిం చాడు. ఆ లింక్‌ తెరవగా ఆమె ఖాతాలోని రూ.10 వేలు డ్రా అయ్యాయి. రణ్‌దీ్‌పసింగ్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. మోసపోయినట్టు గ్రహించిన ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T07:39:07+05:30 IST