రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం

ABN , First Publish Date - 2023-02-01T00:29:51+05:30 IST

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం

రాజేంద్రనగర్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కాటేదాన్‌ టీఎల్‌ఎం గార్డెన్స్‌లో పార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల దగ్గరకు వెళ్లాలని, బీజేపీ కేం ద్రంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని సూచించారు. భూత్‌ స్థాయిలో సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. శక్తి కేంద్రాల వారీగా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనను వివరించాలన్నారు. ప్రతి ఇంటికి కార్యకర్తలు, నాయకులు వెళ్లి బీజేపీ ప్రభుత్వ పనితీరును వివరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పేరాల శేఖర్‌ జీ, మాజీ ఎమ్మెల్సీ కె.దిలీ్‌పకుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్‌, సీహెచ్‌ గోవర్ధన్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు శంకర్‌, బుచ్చిరెడ్డి, డీఆర్‌కె ప్రసాద్‌, కార్యదర్శులు ఎం.కొమురయ్య, వరలక్ష్మి, అనిల్‌కుమార్‌గౌడ్‌, నవతారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు కన్వీనర్‌ ఎన్‌.మల్లారెడ్డి, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ కన్వీనర్‌ పి.మల్లేశ్‌ యాదవ్‌, ఎల్‌బీనగర్‌ కన్వీనర్‌ రవీందర్‌గౌడ్‌, శేరిలింగంపల్లి కన్వీనర్‌ రాఘవేందర్‌, కార్పొరేటర్లు తోకల శ్రీనివా్‌సరెడ్డి, మోండ్ర సంగీత గౌరీశంకర్‌, రాధా ధీరజ్‌రెడ్డి, కొప్పుల నర్సింహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T00:29:54+05:30 IST