‘హాత్‌ సే హాత్‌ జోడో’కు ఇన్‌చార్జిల నియామకం

ABN , First Publish Date - 2023-01-25T02:38:35+05:30 IST

హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్యక్రమ నిర్వహణ కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు ఇన్‌చార్జి బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది.

‘హాత్‌ సే హాత్‌ జోడో’కు ఇన్‌చార్జిల నియామకం

హైదరాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్యక్రమ నిర్వహణ కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు ఇన్‌చార్జి బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది. ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాలకు అజారుద్దీన్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, వరంగల్‌ నియోజకవర్గాలకు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మెదక్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు మహే్‌షకుమార్‌గౌడ్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మహబూబాబాద్‌, ఖమ్మం నియోజకవర్గాలకు జగ్గారెడ్డి, నాగర్‌ కర్నూలు, నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలకు గీతారెడ్డిలను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. కార్యనిర్వాహక అధ్యక్షులకు సహకారం అందించేందుకుగాను ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడిని నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఇన్‌చార్జిలకు బాధ్యతలను మంగళవారం కేటాయించారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని నిర్ణయించడం శోచనీయమని, ఇది గణతంత్ర దినోత్సవాన్ని, రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ గాంధీభవన్‌లో అన్నారు.

Updated Date - 2023-01-25T02:38:35+05:30 IST