గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి.. దరఖాస్తుల స్వీకరణ షురూ

ABN , First Publish Date - 2023-01-25T02:49:02+05:30 IST

రాష్ట్రంలో 1363 గ్రూప్‌-3 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి.. దరఖాస్తుల స్వీకరణ షురూ

హైదరాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1363 గ్రూప్‌-3 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మంగళవారం ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ.. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ వెల్లడించింది. టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని సూచించింది. మొత్తం 1363 గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 30న విడుదలైన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-01-25T02:49:02+05:30 IST